మహేష్ ని వదలడా?

మళ్లీ కయ్యానికి కాలుదువ్వుతున్న బన్నీ2020 సంక్రాంతి కి సరిలేరు నీకెవ్వరూ – అలా వైకుంఠపురములో రెండు సినిమాల రిలీజ్ డేట్స్ మధ్యన ఎంత రగడ జరిగిందో చూసాం. [more]

Update: 2021-01-29 08:19 GMT

మళ్లీ కయ్యానికి కాలుదువ్వుతున్న బన్నీ
2020 సంక్రాంతి కి సరిలేరు నీకెవ్వరూ – అలా వైకుంఠపురములో రెండు సినిమాల రిలీజ్ డేట్స్ మధ్యన ఎంత రగడ జరిగిందో చూసాం. సై అంటే సై అన్నారు, ఢీ అంటే ఢీ అన్నారు. డేట్ కోసం పోటాపోటీగా ఫైట్ చేసారు. అంతేకాదు రెండు సినిమాలు రిలీజ్ లు తర్వాత కలెక్షన్స్ విషయంలో మాది సంక్రాంతి విన్నర్ అంటే మాది సంక్రాంతి విన్నర్ అంటూ ప్రకటించుకున్నారు. ఇన్ని రికార్డ్స్ మాకొచ్చాయి అంటే.. ఇన్ని రికార్డ్స్ మాకొచ్చాయి అంటూ నానా హంగామా చేసారు. ప్రెస్ మీట్స్ , సక్సెస్ మీట్స్ హడావిడి అంతా మాములే. అల్టిమేట్ గా అలా వైకుంఠపురములో సినిమా పై చెయ్యి సాధించింది. 
అయినప్పటికీ జరిగిన రాద్ధాంతం మాత్రం మామూలుది కాదు. అభిమానులైతే సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసారు. ఆపై మొన్నీమధ్యన ఆహా ఈవెంట్ లో మట్లాడుతూ అల్లు అర్జున్ సినిమాల ఇండస్ట్రీల హిట్స్ గురించి అందరి హీరోల పేర్లు ప్రస్తావించి మహేష్ పేరు కావాలని మరిచిపోయాడా? లేదా కాకతాళీయంగా మర్చిపోయాడా? అనే అనుమానాలు అందరిలో కలిగించాడు. ఇది ఇక్కడితో అవ్వలేదు. మొన్ననే మహేష్ సర్కారు వారి పాట అధికారికంగా దుబాయిలో ప్రారంభమైంది. ప్రారంభమైన రోజునే సర్కారు వారి పాట రిలీజ్ డేట్ ఆగష్టు 6th అనుకున్నారు. సర్కారు వారి పాట అనధికారిక రిలీజ్ డేట్ ఆగష్టు 6th అంటూ ఎప్పుడైతే బన్నీ నోటీసు కి వచ్చిందో ఇమ్మిడియట్ గా పుష్ప పాన్ ఇండియా రిలీజ్ డేట్ ఆగష్టు 13 న అంటూ ప్రకటించాల్సిందే అని పట్టుబట్టినట్టుగా ఎవరూ ఊహించని విధంగా పుష్ప సినిమా రిలీజ్ ఈ రోజు ఉదయమే ప్రకటించేసేసారు. 
అంటే ఫస్ట్ అనౌన్స్ చేసింది మేమే అనే క్రెడిట్ వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. మరి ఇప్పుడు మహేష్ ఆ డేట్ కి తగ్గాలా? మరొకటి చూసుకోవాలా? అసలు ఆ డేట్ కి సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందా? రెడీ అవుతుందా? ఇవన్నీ పక్కనబెడితే.. బన్నీ మాత్రం కయ్యానికి కాలు దువ్వడానికి మాత్రం బన్నీ సిద్ధం ఉన్నాడనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది.

Tags:    

Similar News