అంతా అరాచకమే!!

విజయ్ దేవరకొండ తెలంగాణ యాసతో ఇరగదీసాడు. అరవింద సమేత లో ఎన్టీఆర్ ని రాయలసీమ భాష మాట్లాడే ఫ్యాక్షన్ లీడర్ గా చూపించాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ రాయలసీమ [more]

Update: 2020-04-07 10:37 GMT

విజయ్ దేవరకొండ తెలంగాణ యాసతో ఇరగదీసాడు. అరవింద సమేత లో ఎన్టీఆర్ ని రాయలసీమ భాష మాట్లాడే ఫ్యాక్షన్ లీడర్ గా చూపించాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ రాయలసీమ భాషనీ పర్ఫెక్ట్ గా మాట్లాడాడు. తాజాగా అల్లు అర్జున్ చిత్తూరు భాషను ఇరగదీయ్యడానికి రెడీ గా ఉన్నాడు. అల్లు అర్జున్ – సుకుమార్ సినిమాలో అల్లు అర్జున్ పక్కా మాస్ కుర్రాడిగా లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడని ప్రచారం ఉంది. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ పై ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.

అయితే ఈసినిమాలో చిత్తూరు భాష కోసం అల్లు అర్జున్ ట్యూషన్ కూడా పెట్టించుకుని పర్ఫెక్ట్ గా భాషను ఔపోసన పెట్టాడట. ఆసలే కరోనా కారణంగా లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉన్న అల్లు అర్జున్ చిత్తూరు భాషనీ, అలాగే లుక్ ని టోటల్ గా చేంజ్ చేసి పూర్తిస్థాయి మాస్ లుక్ లోకి మారిపోయాడట. ఇక రేపు పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ – సుకుమార్ ల సినిమాకి సంబందించిన ఒక ప్రకటన రానుంది. ఆ పోస్టర్ లో పక్కా చిత్తూరు డైలాగ్స్ తోనే ఉండడంతో అల్లు అర్జున్ ఈ సినిమా లో చిత్తూరు యాసలో చింపేస్తాడని అంటున్నారు. ఇక హీరోయిన్ రష్మిక కూడా చిత్తూరు యాసలోనే మాట్లాడుతుంది అని.. ఒకవేళ రష్మిక కి ఆ యాస పర్ఫెక్ట్ గా సెట్ కాకపోతే డబ్బింగ్ చెప్పించడానికి సుముకుమర్ ఏర్పాట్లు చేసాడట.

Tags:    

Similar News