- ఫస్ట్ లుక్ పోస్టర్ తో బన్నీ సుక్కు హంగామా…
- పుష్ప టైటిల్ కి భీభత్సమైన క్రేజ్
- టెక్నీకల్ ఇష్యుస్ అంటూ ఏ అప్ డేటు ఇవ్వని ప్రభాస్ టీం
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో తర్వాత సుకుమార్ తో సినిమా అని అందరికి తెలుసు. అల్లు అర్జున్ సుక్కు సినిమా కోసం మాస్ మేకోవర్ అయ్యాడు కూడా. త్వరలోనే షూట్ కి వెళ్లాల్సిన సుక్కు – బన్నీ సినిమా కరోనా లాక్ డౌన్ కళ్లెం వేసింది. అయితే సుకుమార్ – అల్లు అర్జున్ కాంబో కొత్తకాదు. హిట్ మీదున్న అల్లు అర్జున్ తో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమర్ సినిమా అనగానే భీబత్సమైన క్రేజ్ రావడం అల్లు అర్జున్ బర్త్ డే రోజున అందరికి షాకిస్తూ పాన్ ఇండియా ఫిలిం పుష్ప గా ఎనౌన్స్ చెయ్యడంతో అందరికి షాక్. కరోనా కారణంగా లాక్ డౌన్ నడుస్తుంది కాబట్టి షూట్ జరగడం లేదు.. అయినా సుకుమర్ అల్లు అర్జున్ తో టెస్ట్ షూట్ చేసి, టైటిల్ డిజైన్ చేసి ఇండియా వైడ్ గా అల్లు అర్జున్ మాస్ లుక్ తోనే సినిమాకి క్రేజ్ తెచ్చాడు సుక్కు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకుంది.
అయితే ఇంతవరకు పాన్ ఇండియా మూవీ చెయ్యని అల్లు అర్జున్ షూటింగ్ మొదలెట్టకుండానే సినిమా పోస్టర్స్ అండ్ టైటిల్ రివీల్ చేసి క్రేజ్ కొట్టేస్తే.. బాహుబలి తో భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న ప్రభాస్ మాత్రం పాన్ ఇండియా లెవల్లో ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే రాధాకృష్ణ తో ప్రభాస్ షూటింగ్ మొదలెట్టి ఒక ఏడాది పూర్తయ్యింది. రాధే శ్యామ్ అంటూ టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ… ఆ మూవీ టైటిల్ రివీల్ చెయ్యలేదు. ఏదో అప్ డేట్ అంటూ యువి వారు హడావిడి చేసి.. కరోనా కారణంగా టెక్నీకల్ ఇష్యుస్ అంటూ ప్రభాస్ ఫాన్స్ కి హ్యాండ్ ఇచ్చారు. భారీ లెవల్లో పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ప్రభాస్ కొద్దిగా షూటింగ్ జరుపుకున్నప్పటికీ… ఒక చిన్న అప్ డేట్ ఇవ్వలేకపోయాడు. మరి పాన్ ఇండియా క్రేజ్ రావాలంటే ఇలాంటి ఖాళీ సమయం కరెక్ట్. ఇప్పటికే రాజమౌళి RRR వీడియోస్ తో అదరగొట్టగా.. బన్నీ పుష్ప టైటిల్ తోనూ లుక్ తోనూ ఇరగదీసాడు. కానీ ప్రభాస్ రెండు పాన్ ఇండియా ఫిలిమ్స్ చేసిన.. సినిమా ప్రమోషన్స్ ఎలా చెయ్యాలో అనేది ఇంకా నేర్చుకోలేదంటున్నారు.