అల్లు అర్జున్ కి మరో అవార్డు.. Indian Of The Year గా బన్నీ
ఇటీవలే చాలా విభాగాల్లో సైమా, ఫిలింఫేర్ అవార్డుల్ని సాధించిన పుష్ప..తాజాగా మరో అవార్డు అందుకుంది. ఎంటర్టైన్మెంట్..;

allu arjun receives indian of the year award
పుష్ప - ది రైజ్ సినిమా.. పాన్ ఇండియా సినిమాగా విడుదలై భారత్ తో పాటు.. విదేశాల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు. పుష్ప సినిమాలోని పాటలు, తగ్గేదే లే డైలాగ్, పుష్ప క్యారెక్టర్ మ్యానరిజం ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వైరల్ అయ్యాయి. బన్నీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. తాజాగా పుష్ప సినిమా వరుసగా అవార్డులు అందుకుంటోంది.
ఇటీవలే చాలా విభాగాల్లో సైమా, ఫిలింఫేర్ అవార్డుల్ని సాధించిన పుష్ప..తాజాగా మరో అవార్డు అందుకుంది. ఎంటర్టైన్మెంట్ క్యాటగిరిలో CNN News18 ఇచ్చే Indian Of The Year అవార్డును అల్లు అర్జున్ అందుకున్నారు. ఈ అవార్డుకు రాజమౌళి, అలియాభట్, వివేక్ అగ్నిహోత్రి, కార్తీక్ ఆర్యన్, అల్లు అర్జున్ నామినేట్ అవ్వగా.. అల్లు అర్జున్ ను ఈ అవార్డు వరించింది. CNN News18 ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని అల్లు అర్జున్ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా అందుకున్నారు. బన్నీ అభిమానులు, ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.