లుక్ అదిరింది.. సినిమా ఎప్పుడు మొదలవుతుంది

అలా వైకుంఠపురములో జోష్ నుండి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న అల్లు అర్జున్ లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సుకుమార్ సినిమా కోసం అల్లు అర్జున్ రఫ్ [more]

Update: 2020-03-15 07:12 GMT

అలా వైకుంఠపురములో జోష్ నుండి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న అల్లు అర్జున్ లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సుకుమార్ సినిమా కోసం అల్లు అర్జున్ రఫ్ లుక్ లో మారుతున్నాడు. కాదు మారిపోయాడు. గెడ్డం పెంచి.. జుట్టు వత్తుగా పెంచి మంచి రఫ్ లుక్ లోకి అల్లు అర్జున్ మారిపోయాడు. సుకుమార్ సినిమా లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా చాలా మాస్ గా కనబడతాడనే టాక్ ఉంది. మరి లారీ డ్రైవర్ అంటే.. చాలా రఫ్ గా.. గెడ్డంతో కనబడినట్లుగానే అల్లు అర్జున్ ప్రస్తుతం ఆ లుక్ లారీ డ్రైవర్ లుక్ లోకి మారిపోయాడు. అల వైకుంఠపురములో విడుదలైన రెండు నెలలకి సుకుమార్ సినిమా కోసం అల్లు అర్జున్ పూర్తిగా మేకోవర్ అయినట్లుగా కనబడుతుంది బన్నీ తాజా లుక్.

అల్లు అర్జున్ తాజాగా ఆయన బాడీగార్డ్ బర్త్ డే ని చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసాడు. అయితే ఆ పుట్టిన రోజు వేడుకల్లో బన్నీ చాలా మాస్ గా బాగా పెరిగిన జుట్టు మరియు గెడ్డంతో వైవిధ్యంగా కనిపిస్తున్నాడు. బన్నీ ఈ సినిమాలో డి గ్లామర్ రోల్ చెయ్యబోతున్నట్లుగా ఈ లుక్ తో కన్ఫర్మ్ అయితే.. అసలు ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే ఇప్పటికే కేరళలో తీసిన కొన్ని సన్నివేశాలను కాదని ఫ్రెష్ గా బన్నీతో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మొదలెట్టాలని సుకుమార్ – బన్నీ కేరళకు బయలుదేరదామనుకున్నారు. మధ్యలో కరోనా వైరస్ భయంతో మూవీ టీం ప్రస్తుతం కేరళ షెడ్యూల్ కి పేకప్ చెప్పేసి.. మరోచోట ఈ షెడ్యూల్ మొదలెట్టాలని అనుకుంటున్నారట . కానీ అది ఎప్పుడనేది స్పష్టత లేదు.

Tags:    

Similar News