అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదే..?

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో మూడో సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ లది హిట్ కాంబో. అందుకే త్రివిక్రమ్ తో అల్లు [more]

Update: 2019-04-15 13:14 GMT

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో మూడో సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ లది హిట్ కాంబో. అందుకే త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ సినిమా అని అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుండి ఆ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. గతంలో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో తండ్రి మీద కొడుకుకు ఉన్న ప్రేమను కథగా తీసుకొని సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తీశాడు. తండ్రీకొడుకుల కథతో ఆ సినిమా తెరకెక్కి హిట్ అయింది. తాజాగా అల్లు అర్జున్ తో మరోసారి తండ్రి సెంటిమెంట్ తోనే త్రివిక్రమ్ ఈ సినిమా కూడా తియ్యబోతున్నాడని.. టైటిల్ కూడా ‘‘నేను నాన్నా’’ అంటూ ప్రచారం జోరుగా జరిగింది.

ఈసారి తల్లి సెంటిమెంట్ తో

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో సన్నాఫ్ సతమూర్తి అంటూ తండ్రి కొడుకుల అనుబంధాన్ని చూపించేశారు. మరోమారు ఎందుకులే అని.. ఈసారి తల్లి సెంటిమెంట్ తో సినిమా చేయబోతున్నారట. ఇక ఈ సినిమాలో తల్లి పాత్ర ప్రాధాన్యతను సంతరించుకోవడం వల్లనే ఆ పాత్రకి గానూ భారీ పారితోషకం ఇచ్చి మరీ టబును తీసుకున్నారని అంటున్నారు. తల్లి పాత్రకున్న వెయిట్ వలన తల్లి పాత్ర వైపు నుంచి టైటిల్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే అలకనంద అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం. మరి అలకనంద అనే టైటిల్ కి త్రివిక్రమ్ మాత్రమే కాదు అల్లు అర్జున్ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నాడట.

Tags:    

Similar News