Raviteja : రవితేజ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. వరస మూవీలతో?

మాస్ మహారాజా రవితేజ మూవీ అంటే మినిమం గ్యారంటీ హిట్ గా భావిస్తారు;

Update: 2025-03-29 08:28 GMT
ravi teja, mass maharaja, minimum guaranteed hit, tolywood
  • whatsapp icon

మాస్ మహారాజా రవితేజ మూవీ అంటే మినిమం గ్యారంటీ హిట్ గా భావిస్తారు నిర్మాతలు. ఎందుకంటే ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా రవితేజ టైమింగ్ కు ఫిదా అవుతారు. డైలాగ్ డెలివరీ కావచ్చు. యాక్టింగ్ కావచ్చు.. కామెడీతో ఆయన చేసే ఫీట్స్ కావచ్చు.. వెరసి రవితేజ మూవీ అంటే ఒకసారి చూడాలని కోరుకుంటారు. ఎందరు అగ్ర కథానాయకుల సినిమాల మధ్య విడుదలయినప్పటికీ రవితేజ మూవీ అంటే అదో స్పెషల్. అందులో తెలియని కిక్కు ఉంటుందని జనం నమ్ముతారు. అందుకే థియేటర్లకు క్యూకడతారు. అయితే హిట్లు, ప్లాప్ లతో సంబంధం లేకుండా రవితేజ వరసగా సినిమాలు చేసుకుంటూ వెళతారు. ఆయనకు కథ నచ్చితే చాలు నటించడానికి ఓకే.

షూటింగ్ లతో బిజీ...
అందుకే నాలుగు పదుల వయసులోనూ ఆయన ప్రతి రోజూ షూటింగ్ లతో బిజీగానే ఉంటారు. వరస సినిమాలతో ప్రేక్షకులకు ముందు వచ్చి అలరిస్తుంటారు. రవితేజకు స్పెషల్ కేటగిరీ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే రవితేజపై డబ్బులు పెట్టడానికి ఏ నిర్మాతయినా కాస్త కూడా వెనకాడరు. తాజాగా రవితేజ మాస్ జాతరతో త్వరలో ప్రేక్షకులకు ముందు వస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది నిర్మాతలు రివీల్ చేయకపోయినా త్వరలోనే థియేటర్లలో రవితేజ మాస్ జాతర ఖాయమంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఈ మూవీ తనకు ప్రత్యేకమని, ఈ సినిమా ప్రేక్షకులతో పాటు తన ఫ్యాన్స్ ను కూడా అలరిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు.
సంతకాలు చేస్తూ...
మరోవైపు మాస్ జాతర ముగియక ముందే వరసగా సినిమాలకు సంతకాలు చేస్తున్నారు. కిశోర్ తిరుమల, కల్యాణ్ చెప్పిన కథలకు రవితేజ ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే మ్యాడ్ ఫేమ్ కల్యాణ్ - రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకు సంబంధించి తాజా అప్ డేట్ వచ్చింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ దీనిని నిర్మంచనుంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ ఒక కార్యక్రమంలో వెల్లడించారు. దీనిని ఫాంటసీ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఖచ్చితంగా రవితేజ ఫ్యాన్స్ తో పాటు అందరినీ అలరిస్తుందని భావిస్తున్నారు. అయితే ఏ మూవీ సెట్స్ పైకి ముందుకు వెళుతుందన్ని ఇంకా తెలియరాలేదు. వరసగా రవితేజ మూవీలు ఈఏడాది అలరించడానికి సిద్ధమవుతున్నాయి. సో.. రవితేజ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ అని చెప్పాలి.


Tags:    

Similar News