నటి అమలాపాల్ కు చేదు అనుభవం
ఈ నేపథ్యంలో ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన అమలాపాల్ కు చేదు అనుభవం ఎదురైంది. దర్శనం కోసం వచ్చిన ..;

tiruvannamalai mahadeva temple
ప్రముఖ సినీనటి అమలాపాల్ కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని ఎర్నాకుళంలో గల తిరువైరానికుళం మహాదేవ ఆలయంలోకి కేవలం హిందూ భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అన్యమతస్తులను ఆలయంలోకి అనుమతించరు. ఈ నేపథ్యంలో ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన అమలాపాల్ కు చేదు అనుభవం ఎదురైంది. దర్శనం కోసం వచ్చిన ఆమెను ఆలయ అధికారులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అన్యమతస్తులకు ప్రవేశం లేదని చెప్పడంతో.. అమలాపాల్ తన అనుభవాన్ని ఆలయ సందర్శకుల రిజిస్టర్ లో రాసుకొచ్చారు.
తనకు అమ్మవారి దర్శనం లభించకపోయినా.. ఆత్మదర్శనం చేసుకున్నాననంటూ అమలాపాల్ రిజిస్టర్ లో రాసుకొచ్చారు. 2023లోనూ మతపరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరమంటూ.. ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలోకి తనను అనుమతించకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్టు పేర్కొన్నారు. తాను ఆలయంలోకి వెళ్లలేకపోయినా దూరం నుంచే అమ్మవారిని ప్రార్థించానని, మతపరమైన వివక్షలో త్వరలోనే మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు రిజిస్టర్ లో రాశారు. అందరినీ సమానంగా చూసే సమయం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.