ప్రియుడిపై కోర్టుకెక్కిన హీరోయిన్?

లాక్ డౌన్ లో ఫోటో షూట్స్ తో.. పర్సనల్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ.. అభిమానులకు చేరువలో ఉన్న అమల పాల్ ఒకసారి భర్త [more]

Update: 2020-11-04 07:47 GMT

లాక్ డౌన్ లో ఫోటో షూట్స్ తో.. పర్సనల్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ.. అభిమానులకు చేరువలో ఉన్న అమల పాల్ ఒకసారి భర్త విజయ్ తో ప్రేమ, పెళ్లి, విడాకులు అంటూ బాగా హైలెట్ అయ్యింది. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తనని చీట్ చేశాడంటూ ఈసారి అమల కోర్టుకెళ్లడం అందరికి షాకిచ్చింది. దర్శకుడు విజయ్ తో విడాకుల తర్వాత అమల పాల్ కెరీర్ లో బాగా బిజీ అయ్యి సినిమాల మీది సినిమాలు చేస్తూ పోతుంది. మధ్యలో ఉన్నట్టుండి అమల పాల్ – బాయ్ ఫ్రెండ్ భ‌వింద‌ర్ సింగ్ లు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూన్న విషయం సోషల్ మీడియాకెక్కింది.

ఎంత ఫాస్ట్ గా ఆ న్యూస్ వచ్చిందో అంటే ఫాస్ట్ గా అమల పాల్ – భ‌వింద‌ర్ సింగ్ పెళ్లి చేసుకున్నట్టుగా, తాళి కట్టినట్టుగా, పెళ్లి బట్టలతో క్లోజ్ గా వున్నా ఫొటోస్ బయటికి రావడంతో అమల పాల్ రెండో పెళ్లి, ప్రియుడు భ‌వింద‌ర్ సింగ్ తో అమల పాల్ సెకండ్ మ్యారేజ్ అంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ ఫోటొస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది గంటలకే డిలేట్ అవడం.. అది పెళ్లి కాదు ఓ యాడ్ షూట్ అమల వివరణ ఇవ్వడం జరిగిన కొన్ని నెలలకు అమల పాల్ భ‌వింద‌ర్ సింగ్ తనని చీట్ చేశాడంటూ కోర్టు కెక్కింది. తన పర్సనల్ ఫొటోస్ తన పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరిని తప్పుదారి పట్టించాడని, దాని వలన తనకి పరువు పోయింది అంటూ అమల పాల్ భ‌వింద‌ర్ సింగ్ పై కేసు వెయ్యడం అందరిని విస్మయానికి గురి చేసింది.

మరి విజయ్ తో ప్రేమ – పెళ్లి – విడాకుల విషయంలో ఓపెన్ గానే ఉన్న అమల పాల్ తర్వాత బాయ్ ఫ్రెండ్ భ‌వింద‌ర్ సింగ్ విషయంలో చాలా సీక్రెట్స్ మైంటైన్ చేసి.. ఇలా ఒకేసారి బరస్ట్ ఎందుకుఅయ్యింది. ఆ ఫొటోస్ భ‌వింద‌ర్ సింగ్ సోషల్ మీడియాలో పెట్టి.. డిలేట్ చేసిన కొన్ని నెలలలకు అమల ఇప్పుడు కోర్టుకి వెళ్లడం వెనుక భ‌వింద‌ర్ సింగ్ – అమల మధ్యన బ్రేకప్ అవడమే కారణమా అంటున్నారు.

Tags:    

Similar News