అమలా కష్టం ఊరికే పోలేదు

లేటెస్ట్ సెన్సేషన్ స్టార్ అమలా పాల్ లేటెస్ట్ మూవీ ‘ఆడై’ (ఆమె) లో ఒక నలభై అయిదు నిమిషాల పాటు నగ్నంగా కనిపించి అందరిని ఆశర్యపరిచింది. ఒక [more]

;

Update: 2019-07-21 07:41 GMT
అమలా పాల్ Amala Paul
  • whatsapp icon

లేటెస్ట్ సెన్సేషన్ స్టార్ అమలా పాల్ లేటెస్ట్ మూవీ ‘ఆడై’ (ఆమె) లో ఒక నలభై అయిదు నిమిషాల పాటు నగ్నంగా కనిపించి అందరిని ఆశర్యపరిచింది. ఒక టాప్ హీరోయిన్ న్యూడ్ గా నటించాలంటే దైర్యం కావాలి. ఇప్పుడున్న హీరోయిన్స్ ఎవరైనా ఈ కథ విని ఇలా చేయాలి అంటే వెంటనే నో చెప్పేస్తారు. కానీ అమలా అవిఏమి పట్టించుకోలేదు. ఈసినిమా తరువాత తనకు పాత్రలు వస్తాయా? రావా? అన్న విషయం కూడా పట్టించుకోలేదు.

రిస్క్ అయితే చేసేసింది. ఇక ఈసినిమా రిలీజ్ విషయంలో కూడా ఏదో ఇబ్బంది ఏర్పడితే తన పారితోషికం కూడా తిరిగి ఇచ్చేసింది. సినిమా కోసం అంత కష్టపడినా అమలా కష్టమయితే వృధా పోలేదు. ఈచిత్రం బాగానే ఉందని టాక్ వచ్చింది. ముఖ్యంగా ఈమూవీలో అమలా నటన గురించి మాట్లాడుకుంటున్నారు. అటు తమిళంలో, ఇటు తెలుగు లో ఈసినిమాకి ఇంతవరకు చెప్పుకోతగ్గ స్పందన లభించలేదు. కారణం ప్రమోషన్స్. అంతేకాదు ఈమూవీ విడుదల ఆలస్యం కావడం కూడా ఈ చిత్రానికి సమస్యగా మారిందని భావిస్తున్నారు. టాక్ పరంగా ఈసినిమా పుంజుకుని అమలకి మరచిపోలేని హిట్టు రావాలి కోరుకుంద్దాం.

Tags:    

Similar News