ఎందుకంత సీక్రెట్?

నటి అమలాపాల్ తమిళ దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. చాలా తక్కువ సమయంలోనే అమలాపాల్ విజయ్ నుండి డివోర్స్ తీసుకుంది. భర్త విజయ్ నుండి [more]

Update: 2020-03-21 07:17 GMT

నటి అమలాపాల్ తమిళ దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. చాలా తక్కువ సమయంలోనే అమలాపాల్ విజయ్ నుండి డివోర్స్ తీసుకుంది. భర్త విజయ్ నుండి దూరమయ్యాక సినిమాలే లోకంగా బ్రతుకుతున్న అమలా పాల్ గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అయితే తాజాగా అమలాపాల్ కి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే న్యూస్ గత నెల నుండి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది కానీ అమలాపాల్ ఎక్కడా ధ్రువీకరించలేదు. ప్రస్తుతం సినిమాల్తో బిజీగా ఉన్న అమలాపాల్ తాజాగా బాయ్ ఫ్రెండ్ ని చాలా సీక్రెట్ గా పెళ్లాడింది.

ఆ విషయాన్ని ఆమల పాలే రివీల్ చేసింది.. పెళ్లి తర్వాత తన భర్త తో దిగిన ఫొటోస్ ని షేర్ చేసి తన పెళ్లి విషయాన్ని అందరికి చెప్పేసింది. సంప్రదాయం ప్రకారమే అమల పాల్ పెళ్లి జరిగినట్టుగా ఆ ఫొటోస్ చూస్తుంటే అర్ధమవుతుంది. అమలా పాల్ బుర్ఖా ధరించి భవ్నిందర్ సింగ్‌తో బయటకు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అమల అలా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఫొటోస్ షేర్ చేసేసరికి అమల పాల్ అభిమానులు షాకవుతున్నారు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసిందే మొన్న.. అప్పుడే పెళ్లా.. మల్లి పెళ్లి విషయంలో అమల పాల్ రాంగ్ స్టెప్ వెయ్యలేదు కదా అంటూ నోరు నొక్కుకుంటున్నారు. కానీ అమల పాల్ మాత్రం కూల్ గా పెళ్ళి ఫొటోస్ షేర్ చేసి, కరోనా కన్నా పెద్ద షాకిచ్చింది.

Tags:    

Similar News