పాపం అమలా పాల్

అమలాపాల్ లేటెస్ట్ సెన్సేషన్ ‘ఆడై’ సినిమా తమిళం, తెలుగు భాషల్లో గత శుక్రవారం రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. ఈమూవీ లో అమలా న్యూడ్ గా నటించి [more]

Update: 2019-07-24 08:00 GMT

అమలాపాల్ లేటెస్ట్ సెన్సేషన్ ‘ఆడై’ సినిమా తమిళం, తెలుగు భాషల్లో గత శుక్రవారం రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. ఈమూవీ లో అమలా న్యూడ్ గా నటించి అందరిని ఆశర్యపరిచింది. న్యూడ్ గా నటించిన ఈసినిమాకు ఆశించిన వసూళ్లు రావడం లేదు. ఇక తెలుగులో అయితే ప్రింట్ ఖర్చులకి కూడా డబ్బులు రావడం లేదు అంటే ఈసినిమా పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

ఏ స్టార్ హీరోయిన్ చేయని విధంగా అమలా పాల్ న్యూడ్‌ గా నటించినప్పటికీ జనాలు ఎవరు దీన్ని పటించుకోట్లేదు. టీజర్ లో ఉన్న సీన్ తప్ప సినిమా లో పెద్ద గా ఏమి ఉండదు అని చాలామంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని లైట్‌ తీసుకున్నట్టున్నారు. కానీ విషయం ఏంటంటే ఈమూవీ ఇంటర్వెల్ తరువాత నుండి అమలా పాల్ దాదాపు ఒక గంట సేపు నగ్నంగానే కనిపిస్తుంది. పాపం అమల ఇంత రిస్క్ చేసి సినిమా చేసిన వసూళ్లు మాత్రం రావడంలేదు.

పైగా అమలా ఈమూవీ రిలీజ్ కి ముందు రెండున్నర నిమిషాల సీన్‌ ఒకటి స్వయంగా రిలీజ్ చేసింది. కానీ జనాలు దీన్ని పట్టించుకోలేదు. ఇది జస్ట్ డేరింగ్ అటెంప్ట్ తప్ప వసూళ్లు వచ్చే సినిమా కాదని ట్రేడ్ చెబుతుంది

Tags:    

Similar News