అమితాబ్ ది హీరోతో సమానమైన రోల్ నో డౌట్?
అమితాబచ్చన్ సై రా సినిమాలో చిరు రిక్వెస్ట్ మీద ఓ గురువుగా కొద్దీ నిమిషాల పటు తెలుగులో నటించాడు. ఆ సినిమా అన్ని భాషల్లోనూ రిలీజ్ అయ్యింది [more]
అమితాబచ్చన్ సై రా సినిమాలో చిరు రిక్వెస్ట్ మీద ఓ గురువుగా కొద్దీ నిమిషాల పటు తెలుగులో నటించాడు. ఆ సినిమా అన్ని భాషల్లోనూ రిలీజ్ అయ్యింది [more]
అమితాబచ్చన్ సై రా సినిమాలో చిరు రిక్వెస్ట్ మీద ఓ గురువుగా కొద్దీ నిమిషాల పటు తెలుగులో నటించాడు. ఆ సినిమా అన్ని భాషల్లోనూ రిలీజ్ అయ్యింది అది వేరే విషయం. సై రా సినిమాలో అమితాబ్ ది జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే. కానీ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కబోయే పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ నటిస్తున్నాడు అనగానే తన రోల్ పై అనేక సందేహాలు. అనేక అనుమానాలు. ప్రభాస్ సినిమాలో అమితాబ్ గెస్ట్ గానా.. లేదంటే కీలక పాత్రా? లేదంటే ఫుల్ లెంత్ రోలా అనే విషయంలో చాలా చర్చలు మొదలయ్యాయి. అయితే ప్రభాస్ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఫుల్ లెన్త్ రోల్ లో నటిస్తున్నాడని దర్శకుడు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చేసాడు.
అయితే ఇప్పుడు ఆ రోల్ పై అందరిలో ఆసక్తి మొదలయ్యింది. నాగ అశ్విన్ చెప్పాడంటే అమితాబ్ కి హీరో రోల్ కి సమానమైన రోల్ ఇచ్చినా ఇచ్చి ఉండొచ్చు అంటున్నారు. నాగ అశ్విన్ మాటల్లో అమితాబ్ రోల్ గురించి ఏమన్నాడంటే… ఈ సినిమా స్క్రిప్ట్ డ్రాఫ్ట్ లో ప్రభాస్ సినేమానికి వర్కింగ్ టైటిల్ గా అనుకున్న పేరే అమితాబ్ ప్రభాస్ సినిమాలో చెయ్యబోయే పాత్ర పేరు అని చెప్పాడంటే అమితాబ్ ది ఎంత కీలకమైన రోలో అర్ధమవుతుంది. అయితే ఆ వర్కింగ్ టైటిల్ ఉంచుతారా? లేదా? అనేది స్పష్టత ఇవ్వలేదు. మరి పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ సినిమాలో అమితాబ్, హీరోయిన్ దీపికా పదుకొనే లు చెయ్యడానికి ఒప్పకున్నానంటే సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకాయి కూడా.