అనుభవించే యోగం లేదు.. ఏం చేస్తాడు!!

బిగ్ బాస్ సీజన్ 4 నుండి గత రాత్రి ఎలిమినేటి అయిన డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ మీద ప్రేక్షకుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అసలు అమ్మ [more]

Update: 2020-11-09 11:39 GMT

బిగ్ బాస్ సీజన్ 4 నుండి గత రాత్రి ఎలిమినేటి అయిన డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ మీద ప్రేక్షకుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అసలు అమ్మ రాజశేఖర్ గత వారమే బయటికి వెళ్ళిపోతాడనుకుంటే.. నాగార్జున – నోయెల్ చలవ వలన అమ్మ రాజశేఖర్ బ్రతికి పోయాడు. కానీ బిగ్ బాస్ హౌస్ లో అమ్మ రాజశేఖర్ మీద అందరి మనస్సులో వ్యతిరేకత ఓ రేంజ్ లో ఉంది. మరి అమ్మ ఈ వారం బయటికి వెళ్లడం పక్కా అనుకున్నట్టుగానే ఆయన రాత్రి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యాడు. ఇక గత వారం కెప్టెన్సీ టాస్క్ లో హారిక – అరియనాల మీద నెగ్గేసి కెప్టెన్ అయిన అమ్మ రాజశేఖర్ తన మీద వ్యతిలేకత ఉన్న కంటెస్టెంట్స్ మీద రివెంజ్ ప్లాన్ చేసుకున్నాడు.

అనుకున్నట్టుగానే అమ్మ రాజశేఖర్ తనకిష్టం లేని అభిజిత్, అఖిల్, హరికలను టార్గెట్ చేసి వాళ్ళని ఆటాడించాడు. ఇంగ్లీష్ మాట్లాడినందుకు అమ్మ రాజశేఖర్ అభిజిత్ కి పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. ఆయితే కెప్టెన్సీలో జెన్యూన్ గా ఉండి ఉంటె ఓకె.. అలా కాకుండా అమ్మ రాజశేఖర్ తనకిష్టమైన అరియనాని పని చెయ్యకుండా అసిస్టెంట్ గా పెట్టుకోవడమే కాదు.. అవినాష్ కి మెహ బూబ్ కి ఎక్కువ పని ఇవ్వకుండా పార్షియాలిటీ చూపిస్తున్నాడు. కెప్టెన్ గా హౌస్ ని ఆటాడించాలనుకుంటున్నాడు. కానీ అమ్మ రాజశేఖర్ కి కెప్టెన్సీ అనుభవించే యోగం లేదు. ఈ వారం ఎలిమినేషన్స్ లో ఉన్న అమ్మ ని బుల్లితెర ప్రేక్షకులు ఎలిమినేట్ చేసేసారు. కెప్టెన్ గ హౌస్ లో అందరి మీద రివేంజ్ ప్లాన్ చేసుకున్న అమ్మకి బిగ్ బాస్ షాకిచ్చి బయటికి పంపేసింది. అనుభవించు రాజా అని అనుకునేలోపే మాస్టర్ బిగ్ బాస్ నుండి బయటికి వచేసాడు.

Tags:    

Similar News