పవన్ కోసం నిర్మాత హడావిడి!!

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి కాగానే నాలుగు సినిమాలు చెయ్యాల్సి ఉంది. అయితే పవన్ వకీల్ సాబ్ తర్వాత ఏది ముందు మొదలు పెడతాడో [more]

Update: 2020-11-11 15:24 GMT

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి కాగానే నాలుగు సినిమాలు చెయ్యాల్సి ఉంది. అయితే పవన్ వకీల్ సాబ్ తర్వాత ఏది ముందు మొదలు పెడతాడో అనేది ఆయా నిర్మతలకు క్లారిటీ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మూడ్ తో నిర్మాతలకు కష్టాలు ఉంటాయనేది తెలిసిన విషయమే. పవన్ ఎప్పుడు ఏ సినిమా మొదలు పెడతాడో అనే దాని మీద క్లారిటీ లేదు. నాలుగు సినిమాల్లో లాస్ట్ గా అనౌన్స్ చేసిన అయ్యప్పన్ కోషియం రీమేక్ ని పవన్ ముందు మొదలు పెట్టబోతున్నాడని.. దాని స్క్రిప్ట్ ఇప్పటికే రెడీగా ఉండడం, ఎలాగూ ఆ సినిమాకి తక్కువ డేట్స్ సరిపోతాయని పవన్ అనుకోవడంతో.. ముందు అయ్యప్పన్ రీమేక్ పవన్ మొదలు పెడతాడని ప్రచారం జరుగుతుంది.

మరి ఆ లెక్కన క్రిష్ సినిమా మళ్ళీ లేట్ అవుతుంది. కానీ ఇప్పుడు క్రిష్ – పవన్ సినిమా నిర్మాత ఏ ఎమ్ రత్నం హడావిడి గా క్రిష్ పుట్టిన రోజునాడు పవన్ కళ్యాణ్ ని కలిసి క్రిష్ సినిమా విషయంలో క్లారిటీ తీసుకున్నాడని.. వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశలో ఉంది.. అది ఫినిష్ కాగానే మన సినిమానే మొదలు పెట్టాలంటూ పవన్ దగ్గర రత్నం మాట తీసుకున్నాడనే టాక్ వినబడుతుంది. మాములుగా కలవడం కష్టం కాబట్టి.. క్రిష్ పుట్టిన రోజునాడు పవన్ తో మీటింగ్ పెట్టి ఓకె చెప్పించుకోవడం తేలిక అని.. ఏ ఎమ్ రత్నం అలా ప్లాన్ చేసాడనే టాక్ వినబడుతుంది.

మరి పవన్ అయ్యప్పన్ కోషియం రీమేక్ మీదకి వెళ్ళిపోతే మళ్ళీ సినిమా 40 నుండి 60 రోజుల లేట్ అవుతుంది. అందుకే క్రిష్ – ఏ ఎమ్ రత్నం లు ఇలా ప్లాన్ చేసి పవన్ తో కమిట్మెంట్ తీసుకున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

Tags:    

Similar News