బోరున విల‌పించిన అనసూయ

యాంకర్‌ అనసూయ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ

Update: 2023-08-19 11:45 GMT

యాంకర్‌ అనసూయ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనసూయ తాజాగా చేసిన పోస్ట్‌ అందరినీ విస్మ‌యానికి గురిచేస్తుంది. బోరును విలపిస్తూ ఇన్‌స్టాలో అనసూయ ఓ వీడియో షేర్ చేసింది. దాని కింద ఓ ఎమోషనల్ నోట్‌ను కూడా రాసింది.

అందరూ ఆరోగ్యంతో, ఉత్సాహంతో ఉన్నారని ఆశిస్తున్నాను. నా పోస్ట్‌ చూసి మీరందరూ గందరగోళంగా ఉన్నారని తెలుసు. నాకు తెలిసి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఒకరితో ఒకరు కనెక్ట్‌ అవడానికి, ఆనందాన్ని పంచుకోవడానికి.. సంస్కృతులను షేర్‌ చేసుకోవడానికి.. పలు విషయాలకు సంబంధించిన సమాచారం కోసమే సోషల్ మీడియా ఉంది. అయితే నిజంగా అదే జరుగుతోందా అనే అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఫోటో షూట్లు, పోజులు, స్మైల్స్‌, డాన్సులు, బలమైన కౌంటర్లు, ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుని నిలబడడం.. ఇలా అన్నీ నా జీవితంలో భాగమే. ఇలాగే నా జీవితంలో కొన్ని దశల‌లో నేనంత‌ బలంగా లేను.. చాలా వీక్‌గానూ ఉన్నాను. ఆ విషయాలను మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నా. ప్రపంచంలో ఎంతటి వ్యక్తులైనా అందరికీ బాధలు, కష్టాలుంటాయి. కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏడుపు వస్తే ఏడ్చేయాలి.. ఆ బాధనంతా బయటకు పంపేసి తిరిగి మళ్లీ మామూలు స్థితికి రావాలి. మళ్లీ స్ట్రాంగ్‌గా కమ్‌ బ్యాక్‌ ఇవ్వాలని పేర్కొంది.



అయితే.. అన‌సూయ ఏడుస్తున్న తీరుకు ఏమైంద‌నే ఆందోళ‌న‌లో కొంద‌రూ.. ఈ విష‌యం చెప్పడానికి ఇంత‌గా ఏడవాలా అని ఇంకొంద‌రూ కామెంట్స్‌ చేస్తున్నారు.


                   

Tags:    

Similar News