అనసూయ వలన తిట్లు తిన్నాడట!!

అనసూయ కి ఎంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ.. అంతమంది శత్రువులు వున్నారు. అనసూయ ని లైక్ చేసేవారికన్నా ఎక్కువగా.. ఆమె కొన్ని విషయంలో సూటిగా మాట్లాడే మాటలకూ [more]

Update: 2020-06-21 03:36 GMT

అనసూయ కి ఎంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ.. అంతమంది శత్రువులు వున్నారు. అనసూయ ని లైక్ చేసేవారికన్నా ఎక్కువగా.. ఆమె కొన్ని విషయంలో సూటిగా మాట్లాడే మాటలకూ చాలామంది శత్రువులు తయారయ్యారు. అనసూయని లైవ్ చాట్ లోనే రకరకాలుగా దూషించేవారున్నారు. అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోస్ వలన, ఆమె మాట్లాడే మాటలకూ ఒక్కోసారి నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు. కానీ అనసూయ వాళ్లకి ధీటుగా సమాధానం ఇస్తుంది. అదే వాళ్ళకి మంట. ఇప్పుడు తాజాగా అనసూయ అభిమాని ఒకరు అనసూయ ఫ్యాన్ పేరుతొ ఓ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసాడట. అయితే ఆ ఫ్యాన్ అనసూయకి ఓ ఎమోషనల్ ట్వీట్ చేసాడు. అనసూయ గారు ఎలా ఉన్నారు… నేను మీ అభిమానిని. అందుకే మీ ఫాన్స్ పేరుతొ ఓ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశాను. దానితో నన్ను చాలామంది తిడుతున్నారు.

నన్ను మాత్రమే కాదు.. నా కుటుంబ సభ్యులను తిడుతున్నారు. ఇక మిమ్మల్ని నేరుగా ఎంతమంది తిట్టి ఉంటారో.. దానికి మీరెంతగా బాధపడి ఉంటారో.. అర్ధం చేసుకోగలను. మిమ్మల్ని శక్తివంతమైన మహిళగా పెంచునందుకు మీ పేరెంట్స్ కి హైట్సాఫ్. మిమ్మల్ని తిట్టేవారి గురించి పట్టించుకోకుండా. దృఢంగా ఉండండి.. లవ్ యు అని పోస్ట్ చేసాడు. దానితో అనసూయ కూడా కాస్త ఎమోషనల్ అయ్యి.. ఈ విషయం నన్ను బాధిస్తుంది. నేను మీ ప్రేమకు అర్హురాలిని అవడానికి ఏం చేసానో తెలియదు కానీ..నా వలన మీరు తిట్లు తింటూ బాధపడుతున్నారు. నేను చెప్పేది ఒక్కటే.. మనమంతా దృఢంగా ఉండాలి.. చుట్టూ ఉన్న కుక్కలు మొరుగుతాయి. అలా అని మనం నీరుగారిపోకూడదు. నువ్వు నా అభిమానివి అయినందుకు నేను గర్వపడుతున్నా అంటూ రిప్లై ఇచ్చింది.

Tags:    

Similar News