అనసూయ చెప్పింది అంటే… చూడాల్సిందే!!

అనసూయ భరద్వాజ్ బుల్లితెర క్వీన్. ఇటు వెండితెర మీద కూడా అనసూయ ప్రత్యేకతను చాటుతుంది. అయితే తాజాగా పుట్టిన రోజు జరుపుకున్న అనసూయ భరద్వాజ్.. తన కొడుకు [more]

Update: 2020-05-21 06:41 GMT

అనసూయ భరద్వాజ్ బుల్లితెర క్వీన్. ఇటు వెండితెర మీద కూడా అనసూయ ప్రత్యేకతను చాటుతుంది. అయితే తాజాగా పుట్టిన రోజు జరుపుకున్న అనసూయ భరద్వాజ్.. తన కొడుకు పుట్టిన రోజుని కేక్ తో సెలబ్రేట్ చేసింది. కరోనా లాక్ డౌన్ లో ఇంట్లోనే ఉన్న అనసూయ అభిమానులతో చిట్ చాట్ చెయ్యడమే కాదు.. కామెంట్ చేసిన నెటిజెన్స్ తో ఆడుకుంటుంది. అయితే తాజాగా అనసూయ కరోనా ఖాళీ సమయంలో .. ఓ వెబ్ సీరీస్ వీక్షించిందట. మే 15 న విడుదలైన ఈ వెబ్ సీరీస్ సూపర్ అంటుంది అనసూయ.

బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శర్మ తన సొంత నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ పతాకంపై పాతాళ్ లోక్ పేరుతో వెబ్ సిరీస్ నిర్మించింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ పాతాళ్ లోక్ అద్భుతమైన వెబ్ సీరీస్ అని, ఇంతవరకు నేను చూసిన వాటిలో ఇదే నా ఫెవరెట్ అని, నటన, మేకింగ్ అన్ని సూపర్ అని, ఈ సీరీస్ పూర్తయిన విధానం నాకెంతో నచ్చింది అనడమే కాదు… ఈ వెబ్ సీరీస్ ప్రతి ఒక్కరు చూడాల్సిన వెబ్ సీరీస్ అని అంటుంది. మరి అనసూయ చెప్పింది అంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే అంటున్నారు ప్రేక్షకులు. 

Tags:    

Similar News