అనసూయ కి షాక్..!

బుల్లితెర మీద హాట్ యాంకర్ గా ఇరగదీస్తున్న అనసూయ భరద్వాజ్ వెండితెర మీద హీరోయిన్ గానే వెలుగుదామనుకుంది. అందుకే వెండితెర మీద ఎంట్రీ ఇచ్చింది. కానీ అనసూయ [more]

Update: 2020-04-28 05:56 GMT

బుల్లితెర మీద హాట్ యాంకర్ గా ఇరగదీస్తున్న అనసూయ భరద్వాజ్ వెండితెర మీద హీరోయిన్ గానే వెలుగుదామనుకుంది. అందుకే వెండితెర మీద ఎంట్రీ ఇచ్చింది. కానీ అనసూయ కి పెళ్లి కావడంతో.. గ్లామర్ ఆరబోసినా హీరోయిన్ పాత్రలు రాలేదు కానీ… సపోర్టింగ్ రోల్స్ తో సరిపెట్టుకుంటున్న అనసూయ కి సుకుమార్ రంగస్థలం సినిమాతో బ్రేక్ ఇచ్చాడు. రంగస్థలంలో రంగమ్మత్తగా అనసూయ కి పిచ్చ క్రేజ్ వచ్చేసింది. అయితే ఆ సినిమా తర్వాత సుకుమార్ అనసూయ కి మరో ఛాన్స్ ఇస్తున్నాడని అన్నారు. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో మొదలుకాబోతున్న పుష్ప సినిమాలో అనసూయ కీ రోల్ చేయబోతుంది అనే టాక్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది.

పుష్ప పాన్ ఇండియా సినిమాగా మారడం.. ఆ సినిమా లో అనసూయ నటిస్తే ఆమెకి పాన్ ఇండియా క్రేజ్ రావడం ఖాయమనుకున్నారు. ఇక పుష్ప సినిమాలో అనసూయ కీ రోల్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న బందిపోటు రాణిగా నటిస్తుంది అనుకున్నారు. అయితే తాజాగా పుష్ప నుండి అనసూయ అవుట్ అంటున్నారు. అనసూయ ని ఈ సినిమా నుండి తప్పించి కాస్త క్రేజ్ ఉన్న.. అవకాశాలు లేని ఓ హీరోయిన్ ని అనసూయ ప్లేస్ లోకి సుక్కు టీం సెలెక్ట్ చేసినట్లుగా ఫిలింనగర్ టాక్. మరి అనసూయ కి ఈ విషయం పెద్ద షాకివ్వడం గ్యారెంటీ.

Tags:    

Similar News