నెటిజెన్ కి అదిరిపోయే రిప్లై ఇచ్చిన అనసూయ!
అనసూయ ఎంతందంగా రెడీ అయ్యి ఫోటో షూట్స్ కి ఫోజులిస్తుందో.. తనకి మండింది అంటే ఘాటైన రిప్లై నెటిజెన్స్ కి ఇస్తుంది అనే విషయం పదే పదే [more]
అనసూయ ఎంతందంగా రెడీ అయ్యి ఫోటో షూట్స్ కి ఫోజులిస్తుందో.. తనకి మండింది అంటే ఘాటైన రిప్లై నెటిజెన్స్ కి ఇస్తుంది అనే విషయం పదే పదే [more]
అనసూయ ఎంతందంగా రెడీ అయ్యి ఫోటో షూట్స్ కి ఫోజులిస్తుందో.. తనకి మండింది అంటే ఘాటైన రిప్లై నెటిజెన్స్ కి ఇస్తుంది అనే విషయం పదే పదే రుజువవుతూనే ఉంది. తన మీద, తన గ్లామర్ మీద, తన వ్యక్తిత్వం మీద కామెంట్స్ చేసి బురద జల్లే నెటిజెన్స్ కి తనదైన స్టయిల్లో అనసూయ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తుంటుంది. తన జోలికి వచ్చిన నెటిజెన్స్ తాట తీసి ఆరేస్తుంది. ఆ రేంజ్ కోపం అనసూయాది. రీసెంట్ గా ఓ నెటిజెన్ అనసూయ ని ఘాటుగా విమర్శించాడు. ఈటీవీలో జబర్దస్త్ స్టేజ్ మీద జబర్దస్త్ ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కటింగ్ అవి జరిగి కమెడియన్స్ తాము ఎలా ఉండేవాళ్ళమో, కానీ జబర్దస్త్ మాకు లైఫ్ ఇచ్చింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భంలో అనసూయ కళ్ళు తిరిగిపడిపోయిన పిక్ ని షేర్ చేస్తూ అనసూయ అనకూడని మాటలతో దూషించడంతో అనసూయకి బాగా మండింది.
బాగా కాలిన అనసూయ నీలాంటి వాడికి రిప్లై ఇవ్వడం కూడా దండగే. కానీ ఎప్పుడో జరిగిన ఓ వీడియో ని పట్టుకుని నువ్వేదేదో మాట్లాడుతున్నావు. నీలాంటి వాడితో మట్లాడడం కూడా వేస్ట్. కానీ నీకు గనక రిప్లై ఇవ్వకపోతే ఇలాంటి వాళ్ళు చాలామంది తయారవుతారు. ఎప్పుడో మూడేళ్ళనాటి వీడియోని పట్టుకుని ఏదేదో మాట్లాడుతున్న నీకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సిందే అంటూ ఆ నెటిజెన్ ని కడిగిపారేసింది అనసూయ. వెండితెర మీద, బుల్లితెర మీద గ్లామర్ గా దూసుకుపోతున్న అనసూయ ఎంత గ్లామర్ చూపిస్తుందో.. కోపమొస్తే అంతే స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వగలదని మరోసారి రుజువు చేసింది.