అనసూయ అరిచింది!!

అనసూయ అరవడమేమిటి అనుకుంటున్నారా.. నిజమే తనని వల్గర్ గా కామెంట్ చేసిన ఓ నెటిజెన్ మీద అనసూయ ఆగ్రహంతో ఊగిపోయింది. తన పుట్టినరోజు మే 15 న [more]

Update: 2020-05-16 04:34 GMT

అనసూయ అరవడమేమిటి అనుకుంటున్నారా.. నిజమే తనని వల్గర్ గా కామెంట్ చేసిన ఓ నెటిజెన్ మీద అనసూయ ఆగ్రహంతో ఊగిపోయింది. తన పుట్టినరోజు మే 15 న అనసూయ సరదాగా సాయంత్రం అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది. అయితే తనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే అభిమానులకు ఒక్కొక్కరికి థాంక్స్ చెబుతూ.. ఉన్న అనసూయ కి ఓ నెటిజెన్ చేసిన కామెంట్ చిరాకు తెప్పించడమే కాదు.. అతనిపై అనసూయ విరుచుకుపడింది.

ఇంతకీ ఆ నెటిజెన్ అనసూయ లైవ్ చాట్ లో ఉండగా.. ఆమెని ఉద్దేశించి… నీకు పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. ఆ డ్రెస్సేమిటి, ముందు బట్టలు సరిగ్గా వేసుకో అని కామెంట్ చెయ్యగానే అనసూయ కి బాగా కాలింది. దానితో అనసూయ అసలు నా బట్టలు గురించి మాట్లాడడానికి నువ్వెవడ్రా… అమ్మంటే నీకు తెలుసా, తన పిల్లల బాధ్యతను చూసూకుంటూ తన గురించి కూడా ఆలోచించుకుంటుందిరా అమ్మ. ఆమె వేసుకునే బట్టల వల్ల అమ్మతనం పోదు. అసలు నేను అందంగా కనిపించడానికి నాకు ఇష్టమొచ్చిన బట్టలు వేసుకుంటా.. నన్నడగడానికి… నువ్వెవరు అంటూ ఆ నెటిజన్ ని ఏకిపారేసింది. అసలు ఇలాంటి వాళ్ళు ఆన్లైన్ లో తప్ప బయట మాట్లాడడానికి సరిపోరంటూ అనసూయ ఆగ్రహంతో అరిచేసింది.

Tags:    

Similar News