వారిపై ఫైర్ అయిన యాంకర్ రష్మీ!!
యాంకర్ రష్మీ నెటిజెన్స్ మీద అప్పుడప్పుడు ఫైర్ అవుతుంది. తనని ఎమన్నా అన్నారా.. వారు చచ్చారే. అస్సలూరుకోదు. రెచ్చిపోయి మాట్లాడుతుంది. కరోనా లక్డౌన్ తో ఇంట్లోనే గడుపుతున్న [more]
యాంకర్ రష్మీ నెటిజెన్స్ మీద అప్పుడప్పుడు ఫైర్ అవుతుంది. తనని ఎమన్నా అన్నారా.. వారు చచ్చారే. అస్సలూరుకోదు. రెచ్చిపోయి మాట్లాడుతుంది. కరోనా లక్డౌన్ తో ఇంట్లోనే గడుపుతున్న [more]
యాంకర్ రష్మీ నెటిజెన్స్ మీద అప్పుడప్పుడు ఫైర్ అవుతుంది. తనని ఎమన్నా అన్నారా.. వారు చచ్చారే. అస్సలూరుకోదు. రెచ్చిపోయి మాట్లాడుతుంది. కరోనా లక్డౌన్ తో ఇంట్లోనే గడుపుతున్న రష్మీ సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. తాజాగా సుధీర్ తో కనీసం ఫ్రెండ్ షిప్ కూడా లేదని చెప్పి షాకివ్వడమే కాదు…. ప్రదీప్ గురించి సాఫ్ట్ గా మాట్లాడి అందరిని కన్ఫ్యూజన్ లో పడేసింది. ఇక తాజాగా మరో విషయం లో రష్మీ గౌతమ్ బాలీవుడ్ నటులపై సంచలనంగా మాట్లాడి అందరికి షాకిచ్చింది.
అదేమిటంటే బాలీవుడ్ లోనే కాదు.. ఇక్కడ టాలీవుడ్ లోను చాలామంది నటులు సొంత గర్భంతో పిల్లలని కనకుండా సరోగసి పద్దతి ద్వారా వారసులను పొందుతున్నారు. గతంలో కరణ్ జోహార్ లాంటి పెద్ద దర్శకనిర్మాత, ఇమ్రాన్ హష్మీ, తాజాగా శిల్ప శెట్టి, టాలీవుడ్ లో మంచు లక్ష్మి లాంటి వాళ్ళు అద్దె గర్భంలోనే పిల్లలను కన్నారు. అయితే సరోగసి ద్వారా పిల్లలని కనే బదులు అనాధ పిల్లలని దత్తత తీస్కొని వారికీ ప్రేమాభిమానాలు పంచోచ్చు కదా అంటూ రష్మీ చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. సొంత రక్తం అయితేనే ప్రేమిస్తారా? ఇది ముమ్మాటికీ వివక్ష చూపడమే. కులం, మతాల అభిమానం లాంటిదే ఇది కూడా. అసలు పిల్లల విషయంలో జీన్స్ అనేది కొంతవరకే అని.. మిగతాదంతా తల్లితండ్రుల పెంపకపైనే ఆధారపడి ఉంటుంది అంటూ సంచలనంగా మాట్లాడింది.