యాంకరింగ్ జోరు తగ్గిందా.. ఇప్పుడు ఇవి అవసరమా?

మలయాళం నుండి తారా జువ్వలా దూసుకొచ్చిన మలయాళ కుట్టి యాంకర్ సుమ మొదట్లో సీరియల్స్, సినిమాలు చేసిన తర్వాత స్పషమైన తెలుగు యాంకర్ గా గుర్తింపు పొందింది. [more]

Update: 2020-03-18 06:48 GMT

మలయాళం నుండి తారా జువ్వలా దూసుకొచ్చిన మలయాళ కుట్టి యాంకర్ సుమ మొదట్లో సీరియల్స్, సినిమాలు చేసిన తర్వాత స్పషమైన తెలుగు యాంకర్ గా గుర్తింపు పొందింది. స్టార్ మహిళా సుమ జీవితాన్నే మార్చేసిన ఈటివి గేమ్ షో. అప్పటికే పలు భారీ సినిమాల ఆడియో వేడుకలకు, ఇంకా సినిమా అవార్డ్స్ ఫంక్షన్స్ కి టాప్ యాంకర్ గా మారిన సుమ భారీగా పారితోషకాలు అందుకునేది. పెద్ద సినిమా ఫంక్షన్ అంటే సుమ ఉండాల్సిందే. అవార్డు వేడుక అంటే సుమ ఉండాల్సిందే. ఇలా ఏ యాంకర్ కూడా సుమ దరిదాపుల్లోకి రాకుండా సుమ చాలా కష్టపడింది. అందం, అదిరిపోయే కామెడీ, పంచెస్, స్పాంటేనియస్ గా చెప్పే డైలాగ్స్ సుమ సొంతం. ఇక అనసూయ, రష్మీ లాంటోళ్ళు హాట్ హాట్ గా ఫెమస్ అయ్యారు కానీ.. సుమ మాత్రం అనర్గళంగా మాట్లాడే స్టయిల్ తోనే ఫెమస్ అయ్యింది. అయితే సుమ ని పిలవాలంటే చాలా కాస్ట్లీ యవ్వారం అంటారు.. అయినా సుమ లేనిదే ప్రోగ్రాం లేదు అన్నట్టుగా దర్శకనిర్మాతలు సుమ నే పిలుస్తారు.

ఇక ఎంత బిజీ గా ఉన్నా సుమ మద్యమద్యలో ఏవో గేమ్ షోస్ అంటూ హడావుడి చేస్తుంది. ఈటీవి జీన్స్, క్యాష్ ప్రోగ్రామ్స్ తోనూ, మా టివి ప్రోగ్రామ్స్ తోనూ బాగా బిజీగా ఉండే సుమకి ఈమధ్యన ప్రోగ్రామ్స్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. లేదంటే చెత్త సీరియల్స్ లాంటి రెండు షోలను సుమ ఎందుకు ఒప్పుకుంటుంది తాజాగా ఆ టివి లో సుమ చేస్తున్న వైఫ్ చేతిలో లైఫ్ … అనే ప్రోగ్రాం మరీ బోరింగ్ గా ఉంది. అలాగే కొత్తగా సుమ మరో షో మొదలెట్టింది. అది హౌస్ ఆఫ్ హంగామా అనే సీరియల్ లాంటి షో అది. ఆ షో చూస్తుంటే.. అబ్బా ఏమిటి వెకిలి కామెడీ అనిపిస్తుంది. సుధా, హేమంత్ లాంటోళ్ళు ఆ షోలో ఉన్నా ఆ ప్రోమో మాత్రం చప్పగా ఉంది. మరి సుమ ఇలాంటి ప్రోగ్రామ్స్ లో నటించడం మహిళలకు అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించడం లేదు. అందుకే సుమని ఎమ్మా ఆడియో వేడుకలకు, అవార్డు ఫంక్షన్స్ కి పిలుపులు తగ్గాయా.. ఇలా క్రేజ్ లేని ప్రోగ్రామ్స్ ని ఒప్పుకుంటున్నావ్ అంటూ సుమ కనకాలను ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్లు.

Tags:    

Similar News