నాలుగు సినిమాలకే ఇంత డిమాండా..?

అనిల్ రావిపూడి కేవలం నాలుగు సినిమాలు డైరెక్ట్ చేసాడు. ముందు మూడు సినిమాలు యావరేజ్ హిట్ అయినా నాలుగో సినిమా ఎఫ్ 2 40 కోట్ల లాభాలు [more]

Update: 2019-04-04 09:08 GMT

అనిల్ రావిపూడి కేవలం నాలుగు సినిమాలు డైరెక్ట్ చేసాడు. ముందు మూడు సినిమాలు యావరేజ్ హిట్ అయినా నాలుగో సినిమా ఎఫ్ 2 40 కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో దిల్ రాజుకి కాసుల పంట పండింది. ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ అయ్యేసరికి అనిల్ రావిపూడి రేంజ్ మహేష్ బాబు వరకు వెళ్లిపోయింది. ఇప్పటివరకు మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేసిన అనిల్ రావిపూడి, మహేష్ బాబుతో సినిమా ఓకే చేసుకుని ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ తో బిజీ అయ్యాడు. మహేష్ మహర్షి సినిమా విడుదలవడమే తడువు అనిల్ రావిపూడి సినిమాపైకి మహేష్ వచ్చేస్తాడు.

నాలుగు సినిమాలకే 12 కోట్లా..?

అయితే ఈ సినిమాకి మహేష్ బాబు వాటాగా 50 కోట్ల పారితోషకాన్ని అందుకుంటుంటే.. అనిల్ రావిపూడికి 12 కోట్ల పారితోషకం నిర్మాత దిల్ రాజు ఇస్తున్నాడనే వార్త ఇప్పుడు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి మహేష్ 50 కోట్లు అందుకుంటుంటే… అనిల్ కి 12 కోట్లు అనేది తక్కువే. కానీ నాలుగు సినిమాలకే ఈ రేంజ్ పారితోషకం అనేది అనిల్ అదృష్టమని చెప్పాలి. మరి ఎఫ్ 2 మ్యాజిక్ అనిల్ కి ఇలా కలిసొచ్చిందన్నమాట.

Tags:    

Similar News