తండ్రి కొడుకులతో సినిమా చేస్తా?

సరిలేరు నీకెవ్వరూ సినిమాతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. తన తదుపరి ప్రాజెక్ట్ గా ఎఫ్ 3 ని చెయ్యబోతున్నాడు. ప్రస్తుతం ఎఫ్ 3 స్క్రిప్ట్ పనులతో [more]

Update: 2020-03-24 05:24 GMT

సరిలేరు నీకెవ్వరూ సినిమాతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. తన తదుపరి ప్రాజెక్ట్ గా ఎఫ్ 3 ని చెయ్యబోతున్నాడు. ప్రస్తుతం ఎఫ్ 3 స్క్రిప్ట్ పనులతో బిజీగా గడుపుతున్నాడు. అయితే అనిల్ తాజాగా తరుణ్ భాస్కర్ షో నీకు మాత్రం చెప్తా లో అనిల్ చాలా విషయాలు పంచుకున్నాడు. దానిలో భాగంగా అనిల్ రావిపూడి బాలకృష్ణ తో మొస్ఖజ్ఞతో సినిమా చెయ్యాలని ఉందని.. అది కూడా తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసినప్పుడు బాలయ్య – మోక్షజ్ఞ ఫోటో తన రూమ్ లో ఉండేదని.. దాన్ని చూసినప్పుడల్లా మోక్షజ్ఞ తో అయినా బాలయ్య తో అయినా సినిమా చెయ్యాలనిపించేదని చెబుతున్నాడు.

బాలయ్య – మోక్షజ్ఞ కలయికలో నందమూరి మల్టీస్టారర్ చేస్తా అని తన ఫ్రెండ్స్ కి చెప్తూ ఉండేవాడిని అని చెబుతున్నాడు. మరి బాలయ్య తన సినిమాల్తో తాను బిజీగా వుంటూ… మోక్షజ్ఞ ఎంట్రీ విషయంపై సైలెంట్ గా ఉంటున్నాడు. మరి అనిల్ రావిపూడి అంటున్నాడు అంటే.. బాలయ్య కూడా మోక్షు ఎంట్రీ విషయం ఆలోచిస్తాడేమో.. గతంలో 2018 జూన్ ఎంట్రీ అంటూ ప్రకటించిన బాలయ్య బాబు మోక్షజ్ఞ సినిమా విషయం ఇప్పటికి క్లారిటీ ఇవ్వలేదు. మరి బాలయ్య ఒప్పుకుంటే.. అనిల్ రావిపూడి బాలయ్య – మోక్షజ్ఞ కోసం ఓ మల్టీస్టారర్ కథ సిద్ధం చెయ్యడనికైతే రెడీ ఉన్నాడు

Tags:    

Similar News