హీరోతో డేటింగ్‌పై అంజ‌లి స్పంద‌న‌

హీరోయిన్ అంజలి మన తెలుగు అమ్మాయే. కానీ తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటుంది. తెలుగులో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో అందరి మనసులు దోచుకున్న అంజలి [more]

Update: 2019-02-07 10:23 GMT

హీరోయిన్ అంజలి మన తెలుగు అమ్మాయే. కానీ తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటుంది. తెలుగులో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో అందరి మనసులు దోచుకున్న అంజలి తమిళ హీరో జైతో డేటింగ్‌ చేస్తుందని వార్తలు రావడంతో దీనిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. గత కొన్ని నెలలు నుండి అంజలి జైతో డేటింగ్ చేస్తుందని…ఇద్దరు క్లోజ్ గా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తుండడంతో వీరి మధ్య ప్రేమ నిజమేనా అన్న అనుమానాలు వచ్చాయి. పైగా సోషల్ మీడియాలో ఒకరినొకరు విష్ చేసుకున్న తీరు చూస్తే ఇది నిజమే అన్న అనుమానం రాక తప్పదు.

అంత టైమ్ లేదు…

అయితే అంజలి తాను ‘జై’తో డేటింగ్‌లో లేననీ, అసలు తమ మధ్య ప్రేమ అనే మాటకు తావే లేదని తేల్చేసింది. తాను ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాల మీదే పెట్టానని.. లవ్ గురించి ఆలోచించేంత టైమ్‌ కూడా తనకు లేదని అంటోంది అంజలి. ఇటువంటి గాసిప్స్‌ తనను మానసికంగా ఇబ్బంది పెడుతుంటాయని అంజలి వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుతం తమిళ సినిమాలతో పాటు తెలుగు సినిమాలతో కూడా బిజీగా ఉన్నానని.. అప్పుడప్పుడు తమిళ సినిమాల కోసం తెలుగు సినిమాలని, తెలుగు సినిమాల కోసం తమిళ సినిమాలని వదులుకోవాల్సి వస్తుందని అంజలి చెప్పింది. మరి అంజలి – జై మధ్య ఏమి లేదా? వీరి ఇద్దరి మధ్య ఏమైనా వివాదాలు తలెత్తాయా.? అన్న వార్తలు కోలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి.

Tags:    

Similar News