ప్లాప్ హీరోలను రిజెక్ట్ చేస్తున్న ప్లాప్ హీరోయిన్

గత ఏడాది అజ్ఞాతవాసి, నా పేరు సూర్య లతో ప్లాప్ కొట్టిన మెగా హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ కి నాగ చైతన్య కూడా శైలజ రెడ్డి అల్లుడు [more]

Update: 2019-01-07 07:44 GMT

గత ఏడాది అజ్ఞాతవాసి, నా పేరు సూర్య లతో ప్లాప్ కొట్టిన మెగా హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ కి నాగ చైతన్య కూడా శైలజ రెడ్డి అల్లుడు తో హిట్ ఇవ్వలేక చేతులెత్తేశాడు. అను ఇమ్మాన్యువల్ అందాలు ఆరబోస్తుంది. నటనలో కూడా పర్వాలేదు. కానీ బేబీకి అస్సలు లక్కు లేదు. ఈలోపు అవకాశం వచ్చిన సినిమాలేవీ ఒప్పుకోకుండా రిజెక్ట్ చేస్తుంది. అయితే ఆ సినిమాల్లో హీరోలను చూసి మరీ అను ఇమ్మాన్యువల్ సినిమాలను రిజెక్ట్ చేస్తూ వస్తుంది. అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో రవితేజ తో కమిట్ అయిన తర్వాత అను బేబీ సైలెంట్ గా ఆ సినిమా నుండి తప్పుకుంది.

లేదంటే ఘోరమైన డిజాస్టర్ కి బుక్కయిపోయేది. ఇక తాజాగా ఈ అమ్మడు మరో ప్లాప్ హీరోకి నో చెప్పిందని టాక్ నడుస్తుంది. అది కూడా రామ్ పోతినేని పక్కన హీరోయిన్ గా చెయ్యనని చెప్పిందట. రామ్ పోతినేని పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాని మొదలెట్టబోతున్నాడు. గత మూడు నాలుగు సినిమాల నుండి యావరేజ్ తోనే సరిపెట్టుకుంటున్న రామ్.. అట్టర్ ప్లాప్ డైరెక్టర్ పూరికి ఛాన్స్ ఇచ్చాడు. త్వరలోనే ఈ కాంబోలో మూవీ పట్టాలెక్కబోతుంటే.. పూరి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా రామ్ సరసన హీరోయిన్ ఎంపికలో తలమునకలయ్యాడట.

అయితే అను అందాలు, ఆమె గ్లామర్ చూసిన పూరి జగన్నాధ్… అను ఇమ్మాన్యువల్ అయితే రామ్ పక్కన బావుంటుందని ఆమెని సంప్రదించగా… కుదరదని చెప్పిందట. మరి అను అలా కుదరదని చెప్పడానికి కారణం.. రామ్ హిట్స్ లో లేడు.. అలాగే పూరి కూడా హిట్స్ కొట్టలేకపోతున్నాడు. అలంటి కాంబోలో నటించడం ఎందుకనుకుందేమో.. ఈ ప్లాప్ హీరోయిన్ రామ్ పక్కన జంటగా నటించేందుకు నో చెప్పింది.

Tags:    

Similar News