అనుష్క కి కూడా ‘ఆ’ అనుభవం అయ్యిందా?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై ఓ ఉద్యమమే మొదలయ్యింది. చాలామంది హీరోయిన్స్ మేము క్యాస్టింగ్ కౌచ్ వలన వేధింపులకు గురయ్యామంటూ గళమెత్తారు. గతంలో టాప్ హీరోయిన్ [more]

Update: 2020-08-24 09:56 GMT

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై ఓ ఉద్యమమే మొదలయ్యింది. చాలామంది హీరోయిన్స్ మేము క్యాస్టింగ్ కౌచ్ వలన వేధింపులకు గురయ్యామంటూ గళమెత్తారు. గతంలో టాప్ హీరోయిన్ గా పనిచేసి.. ప్రస్తుతం ఖాళీ అయిన వారు ఇలా చెబుతుంటే.. ఇంకా కెరీర్ ని కొనసాగిస్తున్న వారు మాత్రం ఈ విషయమై పెదవి విప్పడం లేదు. కారణం వాళ్ళకి ఆఫర్స్ ఎక్కడ పోతాయో అని వారి భయం. తాజాగా అనుష్క శెట్టి కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మరింది. నేను కూడా సినిమా పరిశ్రమలో ఈ క్యాస్టింగ్ కౌచ్ వలన వేధింపులకు గురయ్యా అని చెప్పి షాకిచ్చింది.

సినిమా పరిశ్రమలో ఇలాంటి వేధింపులు సర్వ సాధారణమని, ఆ విషయం అందరికి తెలుసుగా అంటుంది అనుష్క. ఇందులో దాచి పెట్టడానికి ఏం లేదని చెబుతుంది. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని.. కాకపోతే తాను ముక్కుసూటితనంతో వ్యవహరించడంతో పాటు ధైర్యంగా ఉండ‌డంతో ఇలాంటి క్యాస్టింగ్‌ కౌచ్‌ నుంచి త‌ప్పించుకోగ‌లిగానని.. అందుకే తనతో ఎవరూ చెడుగా ప్రవర్తించలేదని చెబుతుంది. కానీ కొత్తగా అడుగుపెట్టేవారికి ఈ క్యాస్టింగ్ కౌచ్ తప్పదని.. తాను మాత్రం ఎవరి బెదిరింపులకు తలొగ్గకుండా వేధింపులకు లొంగకుండా నడుచుకుని నిలబడగలిగాను అంటుంది. మరి అనుష్క కి లైంగికంగా వేధింపులకు గురిచేసిన వారు ఎవరై ఉంటారబ్బా అంటూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలయ్యింది.

Tags:    

Similar News