Samantha : సమంత పిటీషన్ పై న్యాయవాదికి కోర్టు అక్షింతలు

సమంత పిటీషన్ పై కూకట్ పల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. రెండు యూట్యూబ్ ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా వేశారు. వెంటనే విచారణ చేపట్టాలని సమంత [more]

;

Update: 2021-10-21 13:11 GMT

సమంత పిటీషన్ పై కూకట్ పల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. రెండు యూట్యూబ్ ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా వేశారు. వెంటనే విచారణ చేపట్టాలని సమంత తరుపున న్యాయవాది బాలాజీ కోరారు. అయితే న్యాయస్థానం బాలాజీ తీరును తప్పుపట్టింది. ఇది అత్యవసరంగా చేపట్టాల్సిన విచారణా? అని నిలదీసినట్లు తెలిసింది. పరువు నష్టం దావా వేసే బదులు వారి నుంచి క్షమాపణ కోరవచ్చు కదా? అని ప్రశ్నించారు. సమంత విడాకులు తీసుకోకుండానే తీసుకున్నట్లు దుష్ప్రచారం చేశారని న్యాయవాది వాదించారు. పబ్లిక్ డొమైన్ లో సెలబ్రిటీలే తమ వ్యక్తిగత వివరాలు వారే పెడతారని, వారే పరువు నష్టం దావా వేస్తారని కోర్టు వ్యాఖ్యానించింది. మరి కాసేపట్లో దీనిపై తీర్పు వెలువడనుంది.

Tags:    

Similar News