ఈసారి వీరిద్దరూ బ్యాగ్స్ సర్దుకోవాల్సిందేనా?
బిగ్ బాస్ చివరి ఐదు వారాలలో ఏం జరగబోతుందో.. ఎలాంటి టాస్క్ లు బిగ్ బాస్ లో ఉంటాయో.. ఎవరు టాప్ 5 కి వెళతారో అనేది [more]
బిగ్ బాస్ చివరి ఐదు వారాలలో ఏం జరగబోతుందో.. ఎలాంటి టాస్క్ లు బిగ్ బాస్ లో ఉంటాయో.. ఎవరు టాప్ 5 కి వెళతారో అనేది [more]
బిగ్ బాస్ చివరి ఐదు వారాలలో ఏం జరగబోతుందో.. ఎలాంటి టాస్క్ లు బిగ్ బాస్ లో ఉంటాయో.. ఎవరు టాప్ 5 కి వెళతారో అనేది బుల్లితెర ప్రేక్షకుడు ఓ అంచనాకి వచ్చేసాడు. బిగ్ బాస్ ఫైనల్ కి వెళ్ళేది వీళ్ళే అంటూ సోషల్ మీడియాలో నలుగురు పేర్లు హల్చల్ చేస్తున్నాయి. అందులో అభిజిత్, లాస్య, సోహైల్, అఖిల్ పేర్లు టాప్ 5 లో ఉండగా.. ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన మెహబూబ్, అరియనాలు బ్యాగ్స్ సర్దుకోవాలంటున్నారు. మెహబూబ్ ని గత ఐదు వారాలుగా కాపాడుతున్న బిగ్ బాస్ ఈ వారం బయటికి పంపడం ఖాయంగానే కనబడుతుంది. అందుకే రెండు వారాలుగా మెహబూబ్ స్క్రీన్ స్పేస్ తగ్గించింది.
ఇక అరియానని ఓ రేంజ్ లో వెనకేసుకొచ్చిన బిగ్ బాస్, నాగార్జునలు కూడా ఇప్పుడు అరియనా ని బ్యాడ్ చెయ్యడం మొదలు పెట్టాడు. అంటే మెహబూబ్, అరియనాలకు టాస్క్ ల పరంగా, బిగ్ బాస్ గేమ్ పరంగా బాగానే ఆడుతున్నప్పటికీ.. వాళ్ళ క్రేజ్ పరంగా కాస్త వీక్ గా ఉండడం వాళ్ళిద్దరికీ శాపంగా మారింది. అందుకే ఈ వారంలో అరియానని.. అవినాష్ తప్ప మిగతా అందరూ నామినేట్ చేసారు. ఇక మెహబూబ్ కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి. దీన్నిబట్టి ఈసారి మెహబూబ్ అయినా, లేదంటే అరియనా అయినా ఎలిమినేషన్ అయ్యేలా కనబడుతుంది.
అయితే నామినేషన్స్ ప్రక్రియలో అందరిలో అరియనకి ఓట్స్ ఎక్కువ పడి ఆమె ని బ్యాడ్ చేసినా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెకి సింపతీ వర్కౌట్ అవుతుంది. మరి అరియనాకి అతి ట్యాగ్ తగిలించినప్పటికీ.. ఇప్పుడు అరియనా ట్రెండ్స్ లోకి రావడం అందరిని షాక్ కి గురు చేస్తుంది. అరియనా కి సింపతీ వర్కౌట్ అయ్యి ఆమెని సపోర్ట్ చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. దేన్నీ బట్టి ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నది కేవలం మెహబూబ్ మాత్రమే.