సర్కారు వారి పాట లో హీరో అర్జున్

మహేష్ సర్కారు వారి పాట సినిమా మొదలై ఒక ఏడాది గడిచిపోయింది. గత ఏడాది లాక్ డౌన్ టైం లో కృష్ణగారి పుట్టిన రోజునాడు పూజా కార్యక్రమాలతో [more]

Update: 2021-06-01 11:34 GMT

మహేష్ సర్కారు వారి పాట సినిమా మొదలై ఒక ఏడాది గడిచిపోయింది. గత ఏడాది లాక్ డౌన్ టైం లో కృష్ణగారి పుట్టిన రోజునాడు పూజా కార్యక్రమాలతో మొదలైన సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈ ఏడాది జనవరి నుండే మొదలయ్యింది. ఏప్రిల్ ఎండ్ సెకండ్ వేవ్ వచ్చేవరకు సర్కారు వారి పాట షూటింగ్ కి ఎక్కడా బ్రేక్స్ వెయ్యకుండా చూసుకుంది టీం. సెకండ్ వెవ్ రావడంతో మహేష్ టీం లో కొంతమందికి కరోనా రావడంతో ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాలో ఫస్ట్ టైం కీర్తి సురేష్ మహేష్ తో జోడి కడుతుంది. అయితే సినిమా మొదలై ఇన్నాళ్లయినా ఈ సినిమాలో మహేష్ తో తలపడబోయే విలన్ విషయం పరశురామ్ చెప్పడం లేదు.  
బాలీవుడ్ నుండి చాలా పేర్లు వినిపించాయి కానీ.. మహేష్ విలన్ విషయం మాత్రం తెగలేదు. అయితే తాజాగా సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు హీరో అర్జున్ తో ఢీ కొట్టబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే అర్జున్ సర్కారు వారి పాటలో విలన్ రోల్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. సెకండ్ వేవ్ పూర్తికాగానే మొదలు కాబోయే షెడ్యూల్ లో అర్జున్ సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొంటాడని అంటున్నారు. ఇంతకుముందు అర్జున్ లై, రవితేజ ఖిలాడీ మూవీస్ లో విలన్ రోల్ ప్లే చేసాడు. లై అనుకున్న సక్సెస్ అయితే అవ్వలేదు. రవితేజ తో నటించిన ఖిలాడీ ఇంకా విడుదల కాలేదు.

Tags:    

Similar News