పుష్ప అప్ డేట్ - రేపే సమంత ఐటెం సాంగ్
పుష్ప మూవీ విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్.. మూవీ ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేస్తున్నారు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో విడుదల కాబోతున్న మూడో సినిమా పుష్ప - ది రైజ్. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలయ్యే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్.. మూవీ ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేస్తున్నారు. వరుస అప్ డేట్ లు ఇస్తూ.. ప్రేక్షకుల దృష్టిని తమవైపుకు తిప్పుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన పుష్ప ట్రైలర్.. సినిమా పై ఆసక్తిని మరింత పెంచేసింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించగా.. విడుదలైన నాలుగు పాటలు శ్రోతలను ఒక ఊపు ఊపేస్తున్నాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కు ఈ పాటలన్నీ తెగ నచ్చేశాయి.
సాంగ్ పోస్టర్....
పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్పెషల్ సాంగ్ ను మేకర్స్ డిసెంబర్ 10, శుక్రవారం.. అంటే రేపే విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు పుష్ప టీమ్.. సోషల్ మీడియాలో సాంగ్ పోస్టర్ ను విడుదల చేసింది. ఊ అంటావా.. ఊఊ అంటావా అంటూ సాగే ఈ సాంగ్ లో సమంత ఫుల్ లెంగ్త్ డాన్స్ ఉంటుందని అంచనా. పైగా సమంత చేస్తున్న మొదటి ఐటెం సాంగ్ ఇదే కావడం.. అందునా చైతూతో విడాకుల తర్వాత సమంత కనిపిస్తోంది ఈ పాటలోనే కావడంతో.. ఈ సాంగ్ కు మరింత క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. పుష్ప్ టీమ్ విడుదల చేసిన ఈ సాంగ్ పోస్టర్ లో సమంత కనిపించీ, కనిపించనట్లుగానే అభిమానుల దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇక పూర్తి పాట విడుదలైతే.. పుష్ప ఆడియన్స్ కు కిక్కొచ్చినట్లే.