అలా చివరికి అవికా దగ్గరికి వచ్చింది
రాజుగారి గది 3 తమన్నాతో మొదలై చివరికి అవికా గోర్ దగ్గర ఆగింది అనే విషయం తెలిసిందే. ఓం కార్ తమ్ముడు తమన్నా డేట్స్ సర్దుబాటు కాక [more]
రాజుగారి గది 3 తమన్నాతో మొదలై చివరికి అవికా గోర్ దగ్గర ఆగింది అనే విషయం తెలిసిందే. ఓం కార్ తమ్ముడు తమన్నా డేట్స్ సర్దుబాటు కాక [more]
రాజుగారి గది 3 తమన్నాతో మొదలై చివరికి అవికా గోర్ దగ్గర ఆగింది అనే విషయం తెలిసిందే. ఓం కార్ తమ్ముడు తమన్నా డేట్స్ సర్దుబాటు కాక ఆమె తప్పుకుంటే అవికా గోర్ ని తీసుకొచ్చామని చెబితే ఓం కార్ మాత్రం తమన్నా ముందు స్టోరీ లైన్ ఓకె చేసి సినిమా ఓపెనింగ్ కి కూడా వచ్చింది. తర్వాత పూర్తి కథ నేరేట్ చేస్తే.. కథలో మార్పులు చెయ్యమని అడిగింది. కానీ మేం చేయలేమని చెప్పడంతో ఆమె తప్పుకుందన్నాడు.
అంతమంది కాదన్నా…..
తమన్నా తర్వాత ఆ పాత్రకి కాజల్, తాప్సిని కూడా రాజు గారి గది 3 టీం సంప్రదించిందట. కానీ వారు ఒప్పుకోకపోవడంతో… గ్లామర్ గా రీ ఎంట్రీ కి సిద్దమైన అవికా గోర్ ని తీసుకున్నామని రాజుగారి దర్శకుడు ఓం కార్ చెబుతున్నాడు. ఇక తమన్నా కి చెప్పిన కథతో కాకుండా అవికా గోర్ కి సరిపోయే కథని మళ్ళీ ప్రిపేర్ చేసి హీరో అశ్విన్ కేరెక్టర్ ని కాస్త పెంచి ఆ కథతో రాజుగారి గది 3 ని పూర్తి చేశారట. మరి తమన్నా, కాజల్, తాప్సి కాదన్నా రాజుగారి గది 3 రేపు ప్రేక్షకుల ను ఎలా మెప్పిస్తుందో చూడాలి.