బడ్జెట్ కి సరిపోయే కొత్త స్క్రిప్టా?

బాలకృష్ణ – బోయపాటి సినిమా ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేదు.. అసలైతే జనవరి నుండే బోయపాటి – బాలయ్య సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. రూలర్ దెబ్బకి బోయపాటి [more]

Update: 2020-01-08 06:01 GMT

బాలకృష్ణ – బోయపాటి సినిమా ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేదు.. అసలైతే జనవరి నుండే బోయపాటి – బాలయ్య సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. రూలర్ దెబ్బకి బోయపాటి – బాలయ్య సినిమా నిర్మాత వెనక్కి తగ్గడంతో.. బాలకృష్ణ – బోయపాటి సినిమా మొదటికొచ్చింది. గత రెండేళ్లుగా బాలయ్య తో సినిమా చెయ్యాలని బోయపాటి కాచుకుని కూర్చుంటే ఎలాగో ఇప్పటికి వర్కౌట్ అయ్యింది. బాలయ్య అవకాశం ఇచ్చినా నిర్మాత చెట్టెక్కి కూర్చోవడంతో బోయపాటికి ఏం అర్ధం కావడం లేదు. పోనీ నిర్మాత చెప్పినట్టు బడ్జెట్ తగ్గించి సినిమా తీద్దామంటే.. అంత క్వాలిటీ ఉండదు. 70 కోట్ల బడ్జెట్ లెక్కలు ఇప్పుడు తారుమారయ్యాయి.

అయితే ప్రొడ్యూసర్ ఎలాగూ బడ్జెట్ కోత పెట్టాడు.. ఒకవేళ వేరే నిర్మాత ఒప్పుకుంటే అదే కథతో బాలయ్యతో ఓ పవర్ ఫుల్ మూవీ తీద్దామని సిద్దమయిన బోయపాటికి…. బాలయ్య డిజాస్టర్స్ తో వేరే నిర్మాతలెవరూ ముందుకురావడం లేదు. అయితే ఇప్పుడు మిర్యాల రవీందర్ రెడ్డి చెప్పినట్టుగా బడ్జెట్ కంట్రోల్ చేసి.. అదే స్క్రిప్ట్ ని బడ్జెట్ కి తగ్గట్టుగా కథలో మార్పులు చేర్పులు మొదలెట్టాడని అంటున్నారు. తగ్గించిన బడ్జెట్‌కు అనుగుణంగా స్క్రిప్టు మొత్తాన్ని బోయపాటి మళ్లీ మారుస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ స్క్రిప్ట్ వ్యవహారాలన్నీ ఓ కొలిక్కి వస్తేనే సినిమా మొదలెడదామని.. అంతవరకూ కంగారు పడకుండా కథని ప్రేక్షకులు మెచ్చేలా పవర్ఫుల్ గా ఉండాలని… బాలయ్య, బోయపాటికి సలహా ఇస్తున్నాడని ఫిలింనగర్ టాక్.

Tags:    

Similar News