బాలయ్య రెడీనే… కానీ బోయపాటి?

బాలకృష్ణ కరోనా కే భయపడకుండా ఎప్పుడో షూటింగ్ కి రెడీ అని, రామోజీ ఫిలిం సిటీలో బోయపాటి సినిమా షూటింగ్ లో బాలయ్య పాల్గొనబోతున్నాడనే న్యూస్ నడిచింది. [more]

Update: 2020-10-20 15:56 GMT

బాలకృష్ణ కరోనా కే భయపడకుండా ఎప్పుడో షూటింగ్ కి రెడీ అని, రామోజీ ఫిలిం సిటీలో బోయపాటి సినిమా షూటింగ్ లో బాలయ్య పాల్గొనబోతున్నాడనే న్యూస్ నడిచింది. కానీ కరోనా పరిస్థితులు ఇంకా కొలిక్కి రాని కారణంగా సీనియర్ హీరోలు ఎవరూ షూటింగ్ కి రెడీ కావడం లేదు. అందులోను హైదెరాబాదులో వరదలు రావడం ఇంకా పరిస్థితులు అనుకూలించకపోవడంతో షూటింగ్స్ చాలా వాయిదా పడినాయి. అయితే బాలకృష్ణ బోయపాటి షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతాడా అని ఎదురు చూస్తున్నాడు కానీ.. బోయపాటి మాత్రం ఇంకా షూటింగ్ కి సిద్ధం కాలేదట. కారణం ఒకటి హీరోయిన్ అయితే ఇంకా మిగతావి నటులు అలాగే విలన్ ఎంపిక పూర్తి కాలేదని తెలుస్తుంది.

నిన్నగాక మొన్న బాలయ్య కోసం బోయపాటి ఓ హీరోయిన్ ని ఫైనల్ చేసాడనే న్యూస్ నడిచింది. కానీ హీరోయిన్ విషయం ఇంకా తెగలేదని.. నెలరోజులుగా బోయపాటి తన ఆఫీస్ లో హీరోయిన్స్ ఆడిషన్స్ నిర్వహిస్తున్నదని.. అలాగే బాలయ్య కోసం ఇంకా పవర్ ఫుల్ విలన్ ని కూడా బోయపాటి సెట్ చెయ్యలేదని,  కెమెరామెన్‌, ఫైట్ మాస్ట‌ర్లు, సంగీత ద‌ర్శ‌కుడు తప్ప మిగతా టెక్నీకల్, అలాగే కీలక పాత్ర నటులు ఫైనల్ అవ్వలేదని.. కేవలం బాలయ్య పుట్టిన రోజు విడుదల చెయ్యాలనుకున్న BB3 టీజర్ కోసం ఓ షెడ్యూ వేసుకుని షూటింగ్ చేసాడని తెలుస్తుంది. ఇక ఇప్పుడు నటుల ఎంపిక బోయపాటికి సవాల్ గా మారింది అని.. వాళ్ళ డేట్స్ అడ్జెస్ట్ చెయ్యడం కష్టంగా మారిందని అంటున్నారు. బాలయ్య అయితే దసరా తర్వాత BB3 షూటింగ్ మొదలెట్టాలని అనుకునున్నాడట. కానీ అప్పటికి బోయపాటి రెడీ అవుతాడో? లేదో? అంటున్నారు.

Tags:    

Similar News