వాళ్లిద్దరూ దొంగతనంగా…!!

బాలకృష్ణ 60 వ పుట్టిన రోజు వేడుకలు బాలయ్య ఇంట్లో చాలా సాదాసీదాగా జరిగాయి. షష్టి పూర్తి వేడుకలకి ఇండస్ట్రీలోని చాలామంది హాజరవుతారని.. నందమూరి ఫ్యామిలీ మొత్తం [more]

Update: 2020-06-11 05:43 GMT

బాలకృష్ణ 60 వ పుట్టిన రోజు వేడుకలు బాలయ్య ఇంట్లో చాలా సాదాసీదాగా జరిగాయి. షష్టి పూర్తి వేడుకలకి ఇండస్ట్రీలోని చాలామంది హాజరవుతారని.. నందమూరి ఫ్యామిలీ మొత్తం ఒకే చోట కలవబోతుంది అని.. బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి ఆ ఏర్పాట్లని చూసుకుంటున్నది అన్నారు కానీ… బాలయ్య మాత్రం కరోనా వలన ఈఏడాది అభిమానులను కూడా రావొద్దంటూ వాళ్ళకి ఫేస్ బుక్ లైవ్ లోకొచ్చాడు. అయితే బాలయ్య పుట్టిన రోజు ముందు ఆయన పెద్ద కూతురు బ్రాహ్మణి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాలయ్యతో తో తానేమి చిలిపి పనులు చేసిందో చెప్పుకొచ్చింది.

తన తండ్రి బాలయ్యకి మొదటినుండి తెల్లవారు ఝామున 3.30 కి నిద్ర లేవడం అలవాటట. అయితే మూడున్నరకి ఆయన కేబీఆర్ పార్క్ కి తన పెద్ద కూతురు బ్రాహ్మణిని కూడా తీసుకువెళ్ళేవారట. అది కూడా బ్రాహ్మణి చిన్నప్పుడు. ఆమె చిన్నప్పుడు చాలా లావుగా ఉండేదట దానితో బాలయ్య కూతుర్ని తీసుకుని కేబీఆర్ పార్క్ కి వెళితే అక్కడ కేబీఆర్ పార్క్ గేట్లు కూడా తీసేవారు కాదట. దానితో బాలయ్య, బ్రాహ్మణి కేబీఆర్ గేట్ దూకి లోపలికెళ్ళి జాగింగ్, వర్కౌట్స్ చేసేవారట. కూతుర్ని కేబీఆర్ గోడ దూకించాక బాలయ్య కూడా దూకేవాడట. తర్వాత వాళ్ళు వర్కౌట్స్, జాగింగ్ పూర్తి చేసుకుని బయటికొచ్చేసమయానికి కేబీఆర్ గేట్స్ తీసేవారట. అలా వాళ్ళ నాన్నతో కలిసి బ్రాహ్మణి అలాంటి చిలిపి పనులు చేసేదట. పిల్లలతో తన తండ్రి త్వరగా కలిసిపోయి అల్లరి చేస్తాడని చెబుతుంది బ్రాహ్మణి.

Tags:    

Similar News