బండ్ల గ‌ణేష్ రీఎంట్రీ అంట‌..!

తెలుగులో కమెడియన్ గా మంచి పీక్స్ లో ఉండగా ఓ రాజకీయ నాయకుడి స‌హ‌కారంతో నిర్మాత అవ‌తార‌మెత్తాడు బండ్ల గ‌ణేష్. ఒకప్పుడు అనేక స్టార్ హీరోల సినిమాల‌లో [more]

Update: 2019-04-19 06:02 GMT

తెలుగులో కమెడియన్ గా మంచి పీక్స్ లో ఉండగా ఓ రాజకీయ నాయకుడి స‌హ‌కారంతో నిర్మాత అవ‌తార‌మెత్తాడు బండ్ల గ‌ణేష్. ఒకప్పుడు అనేక స్టార్ హీరోల సినిమాల‌లో కమెడియన్ పాత్రల్లో చెలరేగిపోయిన బండ్ల గణేష్ బడా స్టార్స్ తో సినిమాలు సైతం నిర్మించాడు. కమెడియన్ గా ఎంతగా సంపాదించాడో ఏకంగా స్టార్ హీరోలతో సినిమాలు తీస్తున్నాడు అని అప్ప‌ట్లో చాలామంది ముక్కున వేలేసుకున్నారు. అయితే ఒక బడా రాజకీయ నాయకుడు బండ్ల వెనుక షాడోలా నిలబడి.. బండ్ల చేత సినిమాలు నిర్మించాడనే ప్రచారం జోరుగా జరిగింది. ఇక బడా సినిమాలు చేసి కొన్ని హిట్స్ కొట్టి…. కొన్ని డిజాస్టర్స్ తో సినిమాల నిర్మాణానికి దూరమైయ్యాడు. మధ్యలో బాలీవుడ్ నటుడు, నిర్మాత సచిన్ జోషితో వివాదం తెచ్చుకున్నాడు. గత ఏడాది కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో ఫ్లాప్ అయ్యాడు.

మ‌ళ్లీ క‌మెడియ‌న్ గా రీఎంట్రీ

అందుకే ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి కమెడియన్ గా రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడట. అది కూడా స్టార్ హీరో మహేష్ బాబు సినిమాతో. మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కనున్న కామెడీ ఎంటర్టైనర్ లో కామెడీ పండించే ఒక పాత్రను బండ్ల గణేశ్ తో చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దర్శకుడు అనిల్ రావిపూడి బండ్లని సంప్రదించాడట. అనిల్ రాసిన ఆ కామెడీ క్యారెక్టర్ బండ్ల గణేష్ కి బాగా నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నాడనే టాక్ నడుస్తుంది. మరి అనిల్ కి కామెడీ క్యారెక్టర్స్ ని డిజైన్ చెయ్యడంలో ప్రత్యేకత ఉందనేది ఆయన ఎఫ్ 2 సినిమా చూస్తే అర్ధమవుతుంది. మరి బండ్ల మళ్లీ కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చి సినిమా నిర్మాణానికి బై బై చెప్పేస్తాడేమోలే అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాజకీయాలకు ఆయ‌న దండం పెట్టేశాడు.

Tags:    

Similar News