ఆ వీడియో తో రాహుల్ ఫైనల్ విన్నర్ కాలేడా?
బిగ్ బాస్ 3 లో మాట్లాడడం సరిగ్గా రాకపోయినా.. టాస్క్ పెరఫార్మెన్స్ బాగోకపోయినా.. శ్రీముఖితో పెట్టుకున్న వివాదాల వలన రాహుల్ సిప్లిగంజ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా బిగ్ [more]
బిగ్ బాస్ 3 లో మాట్లాడడం సరిగ్గా రాకపోయినా.. టాస్క్ పెరఫార్మెన్స్ బాగోకపోయినా.. శ్రీముఖితో పెట్టుకున్న వివాదాల వలన రాహుల్ సిప్లిగంజ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా బిగ్ [more]
బిగ్ బాస్ 3 లో మాట్లాడడం సరిగ్గా రాకపోయినా.. టాస్క్ పెరఫార్మెన్స్ బాగోకపోయినా.. శ్రీముఖితో పెట్టుకున్న వివాదాల వలన రాహుల్ సిప్లిగంజ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ 3 లో టాప్ 5 లోకి మొట్టమొదటగా అడుగుపెట్టి షాకిచ్చాడు. శ్రీముఖి పర్సనల్ గా ప్రతి వారం రాహుల్ నే టార్గెట్ చెయ్యడంతో రాహుల్ కి బయట సింపతీ ఓట్స్ పడడంతో రాహుల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా తయారవడంతో.. శ్రీముఖి రివర్స్ గేమ్ మొదలు పెట్టి రాహుల్ వదిలేసినా.. రాహుల్ మాత్రం శ్రీముఖి లాంటి ఆల్ రౌండర్ కే గట్టి పోటీ ఇచ్చేస్థాయికి ఎదిగి.. మిస్టర్ కూల్ వరుణ్ సందేశ్ ని దాటుకుని టాప్ 5 లో నిలవడమే కాదు.. టైటిల్ ఫెవరెట్ గా అవతరించాడు.
కానీ తాజాగా సోషల్ మీడియాలో రాహుల్ వీడియో ఒకటి చూస్తుంటే.. రాహుల్ ఫైనల్ విన్నర్ కాలేడని ఫిక్స్ అవ్వొచ్చు. ఎందుకంటే.. రాహుల్ బిగ్ బాస్ సీజన్ 1 టైములో బిగ్ బాస్ ని బండబూతులు తిడుతూ ఓ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇప్పుడు ఆ వీడియో రాహుల్ ని విన్నర్ కాకుండా చేసేలా కనబడుతుంది. బిగ్ బాస్ సీజన్ 1లో దీక్షా పంత్ అనే హీరోయిన్ వచ్చింది. అప్పట్లో దీక్షతో కలిసి రాహుల్ మంగమ్మ అనే సాంగ్ చేసాడు. ఆ సాంగ్ ని బిగ్ బాస్ సీజన్ 1 లో ప్లే చెయ్యగా.. అక్కడున్న కొందరు ఏమిటా పిచ్చి పాట అంటూ కామెంట్స్ చెయ్యగా.. దానికి రాహుల్ రెచ్చిపోయి.. బండబూతులు తిడుతూ(రాయలేని మాటలతో) ఓ వీడియో చేసి పోస్ట్ చేసాడు. మరి అపుడు బిగ్ బాస్ ని అంతలా తిట్టిన రాహుల్ అసలు బిగ్ బాస్ హౌస్లోకి ఎలా అడుగుపెట్టాడు. అక్కడ అంత స్ట్రాంగ్ గా ఎదిగి ఫైనల్ విన్నర్ ఎలా అవుతాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ రెచ్చిపోతూ రాహుల్ ని ఆడేసుకుంటున్నారు. మరి ఈ దెబ్బతో రాహుల్ బిగ్ బాస్ టైటిల్ కొట్టే ఛాన్స్ మిస్ అయినట్లే కనిపిస్తుంది.