నాగ్ సీరియస్ కి కారణం ఎవరు?

బిగ్ బాస్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక ఎత్తు అయితే శనివారం మరియు ఆదివారం ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఈ రెండు  రోజులు హోస్ట్ గా [more]

Update: 2019-09-16 05:55 GMT

బిగ్ బాస్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక ఎత్తు అయితే శనివారం మరియు ఆదివారం ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఈ రెండు రోజులు హోస్ట్ గా ఉన్న వ్యక్తి వారం మొత్తం ఇంటి సభ్యుల ప్రవర్తనపై సమీక్షలు, సలహాలు, సరదాలతో సాగిపోతుంది. సీజన్ 3 లో నాగార్జున హోస్ట్ అని అందరికి తెలిసిందే. మొన్న శనివారం నాగ్ రావడమే చాలా సీరియస్ గా వచ్చాడు.

వాళ్లను నాగ్ ఎందుకు మందలించాడు

అతని కోసం చేసే ఎంట్రీ సాంగ్ ని కూడా మధ్యలో ఆపేసి వారిని పంపేశాడు. లేట్ చేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు నాగ్. నాగ్ ఇంటి సభ్యులలో వారి ప్రవర్తన ఆధారంగా వారికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా శ్రీముఖి, మహేష్ విట్టా, పునర్నవి లను గట్టిగా మందలించడం జరిగింది. సీజన్ 3 లో ఎన్నడూ లేని విధంగా నాగ్ ఇలా సీరియస్ అవ్వడం ఇదే మొదటిసారి. ఆ కొద్దీ సేపటికే నాగ్ అందరిని ఫన్ మూడ్ లోకి తీసుకొచ్చాడు. ఇక ఆదివారం ఎలానో ఫన్ డే కాబట్టి అందరితో సరదాగా గడిపి ఎలిమినేషన్ టైములో శిల్ప చక్రవర్తి ని పంపేశాడు. మొదటి నుంచి అనుకున్నట్టు గానే గత వారం శిల్ప ఎలిమినేట్ అయింది.

 

Tags:    

Similar News