బిగ్ బాస్ రేటింగ్ ఇంత దారుణంగా ఉందా?

బిగ్ బాస్ సీజన్ 4 మొదలైంది మొదలు ఈ సీజన్ పై ఎవరిలో ఉత్సాహం లేదు. ఏదో శని అది వారాల నాగ్ ఎపిసోడ్స్ తప్ప చూడడానికి [more]

Update: 2020-10-23 04:38 GMT

బిగ్ బాస్ సీజన్ 4 మొదలైంది మొదలు ఈ సీజన్ పై ఎవరిలో ఉత్సాహం లేదు. ఏదో శని అది వారాల నాగ్ ఎపిసోడ్స్ తప్ప చూడడానికి బిగ్ బాస్ మరేమీ లేదు. సోహైల్ కేకలు, మెహబూబ్ ఓవరేక్షన్, అఖిల్ – మోనాల్ లవ్ స్టోరీ, హగ్గులు, అమ్మ రాజశేఖర్ ఓవర్ కామెడీ, అభిజిత్ టాస్క్ పెరఫార్మెన్స్ వీక్, హారిక గోల, లాస్య అతి మంచి తనం, దివి అమ్మ అమ్మ అంటూ మాస్టర్ చుట్టూ తిరగడం, అరియనా హైలెట్ అవడానికి నానా తంటాలు పడడం, ఇక అవినాష్ కామెడీతో ఏదో అలా అలా బిగ్ బాస్ రన్ అవుతుంది. ఇక వారం వారం నాగార్జున క్లాస్ కూడా జనాలకు బోర్ కొట్టేసినట్లే కనబడుతుంది. కంటెస్టెంట్స్ అందరిని లైన్ లో అంటే స్కూల్ పిల్లల్లా నిలబెట్టి క్లాస్ ఇవ్వడం రొటీన్ గా మారిపోయింది.

అయితే తాజాగా బిగ్ బాస్ 4 రేటింగ్ చాలా పూర్ గా ఉందని.. ఓపెనింగ్ ఎపిసోడ్ ఎన్టీఆర్ సీజన్ వన్, నాని సీజన 2, నాగ్ సీజన్ 3 ని బీట్ చేసి 18.05 రేటింగ్ వస్తే.. వీక్ డేస్ లో చాలా వీక్ గా 8.35 మాత్రమే వస్తుంది. ఇక తాజాగా నాగార్జున వచ్చే శని, ఆదివారాలు ఎపిసోడ్స్ కి ఎంత మసాలా జోడించిన 11.00 టిఆర్పి రేటింగ్ కి మించడం లేదు. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అని గొంతు చించి మొత్తుకున్నా.. సీజన్ 4 లో పస లేక పోవడం మైనస్ గా మారింది. మరి ఎన్టీఆర్, నాని లని మించి హోస్టింగ్ లో దూసుకుపోయిన నాగార్జున ఇప్పుడు బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్ కి వస్తున్న రేటింగ్ తో అసంతృప్తితో ఉన్నాడని అంటున్నారు. ఇక వైల్డ్ డాగ్ కోసం నాగార్జున వేరే రాష్ట్రానికి షూటింగ్ కోసం వెళ్లగా ఈ వారం నాగ్ ప్లేస్ లోకి కొత్త హోస్ట్ రావొచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో రేజ్ అయ్యాయి.

Tags:    

Similar News