బిగ్ బాస్ లో బికినీ అందాలు

కోర్టు కేసులు, క్యాస్టిగ్ కౌచ్ ఆరోపణలు అంటూ తీవ్ర సస్పెన్స్ నడుమ గత ఆదివారం నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 రియాలిటీ షో [more]

Update: 2019-07-25 05:35 GMT

కోర్టు కేసులు, క్యాస్టిగ్ కౌచ్ ఆరోపణలు అంటూ తీవ్ర సస్పెన్స్ నడుమ గత ఆదివారం నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 రియాలిటీ షో స్టార్ మా లో మొదలైన విషయం తెలిసిందే. నాగార్జున వ్యాఖ్యాతగా 15 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 3 హౌస్ లోకి అడుగుపెట్టారు. మొదట్లో కాంట్రవర్సీలకు నెలవుగా మారిన బిగ్ బాస్ అంటేనే మండిపడినవాళ్లు మెల్లగా ఇప్పుడు బుల్లితెర మీద బిగ్ బాస్ ని ఫాలో అవుతున్నారు. ఇక ఈ సీజన్ లో వరుణ్ సందేశ్, వితిక సేరు, శ్రీముఖి, పునర్నవి భూపాళం లాంటి వాళ్ళు తప్ప పెద్దగా ఓ అన్నంత గా అనిపించే కంటెస్టెంట్స్ లేరు. మరి షో ని రెండో రోజే కాస్త గొడవలతో రక్తి కట్టించిన కాంటెస్టన్స్…మెల్లగా ప్రేక్షకులకు చేరువవుతున్నారు. అయితే శ్రీముఖి, వితిక, పునర్నవి లాంటి వాళ్ళు హాట్ హాట్ బట్టలేసుకుని షో లో తిరుగుతున్నా పెద్దగా జనాలు పట్టించుకోవడం లేదు.

అయితే ఆ హాట్ అందాలు సరిపోవని భావించిన స్టార్ మా యాజమాన్యం ఇప్పుడు షో లోకి ఓ వైల్డ్ కార్డు ఎంట్రీని త్వరలోనే ఇప్పించబోతున్నట్లుగా తెలుస్తుంది. అది కూడా ఒకప్పుడు హాట్ హీరోయిన్ గా అడపా దడపా సినిమాలు చేసిన శ్రద్ద దాస్ ని స్టార్ మా బిగ్ బాస్ కోసం తీసుకురాబోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో వినబడుతుంది. గతంలో గ్లామర్ పాత్రలు చేసిన శ్రద్ద దాస్ ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా వుంది. అయితే తనకో బ్రేక్ కావాలని భావించిన శ్రద్ద దాస్ స్టార్ మా బిగ్ బాస్ కోసం అడగ్గానే ఒప్పేసుకుందని.. బిగ్ బాస్ లో బికినీ అందాలు చూపించడానికి రెడీ అవుతుందనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. గతంలో బిగ్ బాస్ కోసం హెబ్బా ని అడిగితె ఆమె నో చెప్పింది. కానీ ఇప్పుడు శ్రద్ద మాత్రం భారీ పారితోషకానికి బిగ్ బాస్ సీజన్ 3 లో ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్లుగా సమాచారం

Tags:    

Similar News