రాహుల్ హీరో.. పునర్నవి హీరోయిన్?

బిగ్ బాస్ లో క్యుట్స్ లవర్స్, లవ్ బర్డ్స్ గా పేరు గాంచిన రాహుల్ సిప్లిగంజ్, పునర్నవీలు మా మధ్యన ఏం లేదు మహాప్రభో… మేము కేవలం [more]

Update: 2019-11-11 08:35 GMT

బిగ్ బాస్ లో క్యుట్స్ లవర్స్, లవ్ బర్డ్స్ గా పేరు గాంచిన రాహుల్ సిప్లిగంజ్, పునర్నవీలు మా మధ్యన ఏం లేదు మహాప్రభో… మేము కేవలం స్నేహితులమే అని చెప్పినా ఎవరూ వినే పొజిషన్ లో లేరు. పునర్నవి కి వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని రాహుల్ చెప్పిన ఎవరూ వినడం లేదు. వీరిద్దరి మధ్యన ఏదో ఉండనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడలేదు. ఇక వారిమధ్యన ఉన్న సం థింగ్ సం థింగ్ వ్యవహారాన్ని క్యాష్ చేసుకునే పనిలో టివి ఛానల్స్ ఉన్నాయి. రాహుల్ తో పాటుగా పునర్నవిని కూడా షోస్ కి పిలుస్తూ… రేటింగ్స్ పెంచుకుంటున్నాయి

అయితే తాజాగా రాహుల్.. పునర్నవి తాను స్నేహితులం మాత్రమే అని, ప్రేమికులం ఎప్పటికి కాలేమని క్లారిటీ ఇస్తూనే.. పునర్నవి తో సినిమా ఛాన్స్ వస్తే వదులుకోనని అంటున్నాడు. బిగ్ బాస్ విన్నర్ గా రాహుల్ క్రేజ్ పెరిగింది. సింగర్ గా అవకాశాలతో పాటుగా రాహుల్ కి హీరో వేషాలు కూడా వస్తాయని కళలు కంటున్నట్టుగా ఉన్నాడు. అందుకే తాను హీరోగా పునర్నవి హీరోయిన్ గా సినిమా పై మనసుపారేసుకున్నాడు ఈ సింగర్ గల్లీ బాయ్. తనని పునర్వి తో ఛాన్స్ వస్తే సినిమా చేస్తావా అంటే.. అంతకన్నా అదృష్టమా అంటూ సమాధానం చెబుతున్నాడంటే.. రాహుల్ కాస్త ఎక్కువగా ఊహించుకుంటున్నాడనిపిస్తుంది

Tags:    

Similar News