ఈ హౌస్ మెట్ పక్కాగా ఎలిమినేట్ అవుతాడు

నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. అదే కుండ బద్దలు కొట్టే టాస్క్‌. ఈ టాస్క్ లో బిగ్ [more]

Update: 2019-10-11 08:05 GMT

నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. అదే కుండ బద్దలు కొట్టే టాస్క్‌. ఈ టాస్క్ లో బిగ్ బాస్ ప్రతి హౌస్ మెట్ కి ఒక వీడియో చూపిస్తారు. ఆ వీడియోను చూసిన తరువాత ఎవరి మీద అయితే కోపం ఉందో వారి ఫోటో ఉన్న కుండ బద్దలు కొట్టాలి. అసలే బిగ్ బాస్ లో ఇంత కాలం ఎలా నెట్టుకొచ్చాడో అనే ఫీలింగ్ తో మహేష్ పై శ్రీ ముఖి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

మహేష్ కి బై…బై…?

నిన్న ఈ టాస్క్ లో శ్రీముఖి కి ఒక వీడియో చూపించారు. అందులో మహేష్ తనకి కానీ పవర్‌ వుంటే శ్రీముఖిని ఎలిమినేట్‌ చేసేస్తానని మహేష్‌ మాట్లాడిన వీడియోని టెలికాస్ట్‌ చేశారు. అది చూసిన శ్రీముఖి కి బాగా కోపం వచ్చింది. వెంటనే మహేష్ ను బయటకు పిలిచి అతనికి ఏమి చెప్పకుండా ఆల్‌ ది బెస్ట్‌ చెప్పి అతని ఫోటో అతికించిన కుండ గట్టిగా బద్దలు కొట్టింది. ఆ తరువాత మహేష్ కి కూడా శ్రీముఖి కి సంబంధించి వీడియో ఒకటి చూపించారు. అప్పుడు మహేష్ కూడా సేమ్ అలానే శ్రీముఖి కి అల్ ది బెస్ట్ చెప్పి కుండ బద్దలు కొట్టాడు. సో దాంతో మహేష్ మరింత నెగటివ్ అయ్యాడు జనాల దృష్టిలో. ఈ వారం కచ్చితంగా మహేష్ ఎలిమినేట్ అవుతాడు అని భావిస్తున్నారు.

 

Tags:    

Similar News