BiggBoss : బిగ్‌బాస్ హౌస్‌లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. రిజల్ట్ ఏమైంది..?

ఇటీవల బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న అంకితకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రిజల్ట్ ఏమైంది..?;

Update: 2023-11-25 13:59 GMT

BiggBoss : ఇండియన్ ఎంటర్‌టైన్మెంట్ రంగంలో బిగ్‌బాస్ షో బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షోగా ఆడియన్స్ ఆదరణ పొందుతుంది. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం.. ఇలా లాంచ్ అయిన ప్రతి భాషలో విశేష ప్రేక్షాదరణ అందుకుంది. అసలు పరిచయం లేని వ్యక్తులు కూడా బిగ్‌బాస్ హౌస్ లోకి వచ్చి స్నేహితులు అవుతారు, ప్రేమికులుగా కూడా మారతారు. అయితే మొట్టమొదటిసారి బిగ్‌బాస్ హౌస్ లో ఒకరు తల్లి కాబోతున్నారని ఒక వార్త బాగా వైరల్ అయ్యింది.

సల్మాన్ ఖాన్ హోస్టుగా హిందీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ సీజన్ 17 లోని ఒక కంటెస్టెంట్ కి ఇటీవల హౌస్ లో ప్రెగ్నెన్సీ టెస్ట్ నిర్వహించారు. ఆ రిజల్ట్ ఏమైంది..? ఆమె నిజంగా తల్లి అవ్వబోతుందా..? అసలు ఏం జరిగింది..? ఈ సీజన్ లో టెలివిజన్ స్టార్ కపుల్ అంకిత, విక్కీ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇటీవల అంకిత.. తనకి ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అనే సందేహంతో బిగ్‌బాస్ నిర్వాహుకులను సంప్రదించింది. వారు ఆమెకు టెస్టులు కూడా నిర్వహించారు.
ఆ రిజల్ట్స్ కోసం అంకిత ఎదురు చూస్తున్నట్లు తన భర్త విక్కీకి తెలియజేసింది. ఈ విషయం బాగా వైరల్ అయ్యింది. ఆమె ప్రెగ్నెన్సీ నిజమైతే.. బిగ్‌బాస్ హిస్టరీలోనే ఇదొక రికార్డు అని అందరూ కామెంట్స్ చేస్తూ వచ్చారు. మరి ఆ రిజల్ట్ ఏమైంది..? అంకిత ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగటివ్ వచ్చిందని ఓ నేషనల్ మీడియా పేర్కొంది. దీంతో అంకిత ప్రెగ్నెన్సీ పై ఉన్న సస్పెన్స్ కి తెరపడింది.


Tags:    

Similar News