బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి తప్పుచేశాడా?

బిగ్ బాస్ 5 సీజన్ మొదలయింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ప్రవేశించారు. వీరిలో ఎక్కువ మంది జనాలకు తెలియని వారే. అయితే అందరూ [more]

Update: 2021-09-06 13:46 GMT

బిగ్ బాస్ 5 సీజన్ మొదలయింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ప్రవేశించారు. వీరిలో ఎక్కువ మంది జనాలకు తెలియని వారే. అయితే అందరూ ముదుర్లే ఉన్నట్లుంది. హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్లలో ఒక్క సింగర్ శ్రీరామ చంద్ర ఒక్కరే మానసింగా బలహీనంగా ఉన్నట్లు కన్పిస్తుంది. శ్రీరామ చంద్ర వారితో నెగ్గుకు రాలేరని, బయటకు రావడమే మంచిదని అప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు కన్పిస్తున్నాయి. శ్రీరామచంద్ర వ్యక్తిగతంగా కూడా సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తి అని, ఈ హౌస్ లో ఉన్న ముదురు కంటెస్టెంట్లను ఆయన ఎదుర్కొనలేరన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. శ్రీరామ చంద్ర అసలు హౌస్ లోకి వెళ్లడమే తప్పు అన్న కామెంట్స్ జోరుగా వినపడతున్నాయి.

Tags:    

Similar News