నిలిచిపోయిన బిగ్ బాస్ లైవ్ షో
బిగ్ బాస్ నాన్ స్టాప్ లైవ్ స్ట్రీమింగ్ నిలిచిపోయింది. బుధవారం అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు
బిగ్ బాస్ నాన్ స్టాప్ లైవ్ స్ట్రీమింగ్ నిలిచిపోయింది. బుధవారం అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సాంకేతిక కారణాలతో దీనిని నిలిపేస్తున్నట్లు షో నిర్వాహకులు చెప్పారు. తిరిగి ఈరోజు అర్థరాత్రి నుంచి లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ షో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో గత నెల 26 నుంచి ప్రారంభమయిన సంగతి తెలిసిందే.
సాంకేతిక కారణాలే....
మొత్తం 17 మంది కంటెస్టంట్లతో షో ప్రారంభమయింది. గత ఐదు సీజన్లలో బిగ్ బాస్ లో ఉన్న వారు, కొత్తవారిని కలిపి షోను ప్రారంభించారు. 84 రోజుల పాటు జరగనున్న ఈ షో అర్థాంతరంగా నిలిపివేయడానికి కారణం సాంకేతిక లోపాలేనని అంటున్నారు. లైవ్ స్ట్రీమింగ్ సరిగా జరగకపోవడం, ఒక గంట ఆలస్యంగా లైవ్ ఇస్తుండటంతో కొన్ని సమస్యలు తలెత్తాయని తెలుస్తోంది. ఈరోజు అర్ధరాత్రి నుంచి తిరిగి లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.