అందుకే ఆ జంటని కాపాడుతుంది

బిగ్ బాస్ సీజన్ 3 చాలా చప్పగా సాగుతుంది. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ అంతా చాలా జాగ్రత్తగా గేమ్ ఆడుతున్నారు. ఎక్కడ ఎటువంటి గొడవలకు తావివ్వకుండా [more]

Update: 2019-09-20 07:32 GMT

బిగ్ బాస్ సీజన్ 3 చాలా చప్పగా సాగుతుంది. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ అంతా చాలా జాగ్రత్తగా గేమ్ ఆడుతున్నారు. ఎక్కడ ఎటువంటి గొడవలకు తావివ్వకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని షో కి వచ్చినట్టుగా కనబడుతుంది. నాగార్జున చెప్పినట్టుగా ఎవరు ఇంతవరకు తమ ముసుగు తియ్యలేదు అనిపిస్తుంది. ఇక బిగ్ బాస్ నిర్వాహకులు కూడా తమకు కావాల్సిన, క్రేజ్ ఉన్న కంటెస్టెంట్స్ ని కాపాడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. హౌస్ లో పునర్నవి, శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితికాలు కాస్త పేరున్న క్రేజున్న కంటెస్టెంట్స్. వారిని కాపాడడానికి బిగ్ బాస్ ఎత్తులు వేస్తుంది. మిగతా వాళ్ళని ఒక్కొక్కరిగా హౌస్ నుండి బయటికి పంపుతున్నారు.

నటిస్తే చాలు…..

ఇక వరుణ్ – వితిక భార్యాభర్తలు గనక వారిద్దరూ హౌస్ లో ఉంటే.. బిగ్ బాస్ కి క్రేజ్ వస్తుందని చెప్పి.. వారిని కాపాడుతున్నారు. వరుణ్ సందేశ్ మొదట్లో ఎలా ఉన్నా ప్రస్తుతం మిస్టర్ కూల్ టాగ్ వేసుకున్నాడు. ఇక వితిక అన్నింటికి అగ్రెస్సివ్ అవుతుండేది.. కానీ ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతుంది. ఇక వీరి క్రేజ్ తో బిగ్ బాస్ నిర్వాహకులు వారికి ఈ సీజన్ మొత్తానికి కలిపి 30 లక్షల పారితోషకానికి తెచ్చారట. ఫైనల్స్ వరకు ఉన్నా ఇస్తారు, లేకున్నా అదే పేమెంట్ వారికి వస్తుంది. ఇక ఫైనల్ విన్నర్ అయితే మరో 50 లక్షలు ఈ జంటకి అదనం. అప్పటివరకు ఉంచేలా బిగ్ బాస్ ప్లాన్ చేస్తుందంటున్నారు. మరోపక్క శ్రీముఖి, పునర్నవికి కూడా గట్టిగానే ఇస్తున్నారట. మిగతా వాళ్ళకి వారానికి ఇంత అని మట్లాడారు కానీ.. పై నలుగురికి మాత్రం ఒకె ఎమౌంట్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది.

 

 

Tags:    

Similar News