చిక్కుల్లో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండజ్

నటి జాక్వెలిన్ ఫెర్నాండజ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది ఈ నెల 8న విచారణకు హాజరు కావాలని కోరింది

Update: 2021-12-07 03:51 GMT

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండజ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది ఈ నెల 8వ తేదీన ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మనీలాండరింగ్ కు సంబంధించి జాక్వెలిన్ ఫెర్నాండజ్ కు ఈ నోటీసులు ఈడీ జారీ చేసింది. 200 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సుకేశ్ చంద్రశేఖర్, నటి లీనా, పాల్ తో పాటు మరో ఆరుగురి పై కేసు నమోదు చేసింది.

విలువైన బహుమతులు..
ఈ కేసులో ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ జాక్వెలిన్ ఫెర్నాండజ్ కు విలువైన బహుమతులు ఇచ్చినట్లు గుర్తించింది. ఇప్పటికే విచారించినా మరికొన్ని విసయాలను రాబట్టేందుకు మరోసారి విచారణకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇటీవలే ఈ కేసులో చంద్రశేఖర్ బెయిల్ పై విడుదలయ్యాడు. జాక్వెలిన్ ఫెర్నాండజ్ పై ఇప్పటికే ఈడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.


Tags:    

Similar News