అనసూయ బాలీవుడ్ ఎంట్రీ?

అనసూయ భరద్వాజ్ టాలీవుడ్ టాప్ హాట్ యాంకర్. వెండితెర మీద ఎప్పటికప్పుడు అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంటుంది. బుల్లితెర మీద అనసూయ క్రేజ్ మామూలుది కాదు. సుమ మాటలతూటాలతో [more]

Update: 2020-05-12 03:54 GMT

అనసూయ భరద్వాజ్ టాలీవుడ్ టాప్ హాట్ యాంకర్. వెండితెర మీద ఎప్పటికప్పుడు అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంటుంది. బుల్లితెర మీద అనసూయ క్రేజ్ మామూలుది కాదు. సుమ మాటలతూటాలతో అదరగొడితే..ఆనసూయ మాత్రం హాట్ హాట్ యాంగిల్స్ తో చించేస్తుంది. అయితే ఇప్పటివరకు అనసూయ టాలీవుడ్ ని వదిలి మరో భాషలో ఎక్కడా ట్రై చెయ్యలేదు. గతంలో తమిళనాట నటించాలని ఉందని.. కానీ తమిళంలో మంచి అవకాశాలు రావడం లేదని అంది.మధ్యలో ఒకటిరెండు అవకాశాలు వచ్చినా అవి తనకి నచ్చేలేదని చెప్పుకొచ్చింది.

అయితే తాజాగా అనసూయ కి బంపర్ ఆఫర్ తలుపు తిట్టిందట. అది కూడా ఓ బాలీవుడ్ ఆఫర్ అట. అనసూయ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఖాయమంటూ  సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతుంది. అయితే అనసూయకి వచ్చింది సినిమా ఆఫర్ కాదని.. ఓ టివి సీరియల్ లో అవకాశం వచ్చింది అని తెలుస్తుంది. టాలీవుడ్ లో ఎప్పుడు సీరియల్స్ వైపు చూడని అనసూయ బాలీవుడ్ సీరియల్ లో నటిస్తుందా అనే అనుమానం ఉండొచ్చు. అయితే హిందీ సీరియల్ లో అనసూయ కి ఓ మెయిన్ లీడ్ చేసే అవకాశం రావడం.. అలాగే ఆ సీరియల్ కోసం తక్కువ డేట్స్ సరిపోతాయని.. అందుకే అనసూయ కూడా ఈ సీరియల్ చేసేందుకే మొగ్గు చూపుతుంది అనే  ప్రచారం ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. సీరియల్ పెద్దదే అయినా.. అనసూయ రోల్ కొన్ని రోజులకు ముగుస్తుంది అని.. ఆ పాత్ర నచ్చే అనసూయా ఒప్పుకుంది అంటున్నారు.

Tags:    

Similar News