ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత.. విషాదంలో సినీ పరిశ్రమ
ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. 'నా స్నేహితుడు, గొప్ప నటుడు, అంతకంటే మంచి మనిషి శివ సుబ్రమణియన్ మరణవార్త విని చాలా షాక్ అయ్యాను.;
ముంబై : బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు, స్క్రీన్ రైటర్ శివ సుబ్రమణియన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆ కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా.. సుబ్రమణియన్ మరణానికి గల కారణాలు తెలియలేదు. సుబ్రమణియన్ మరణవార్త విన్న పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ సుబ్రమణియన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. 'నా స్నేహితుడు, గొప్ప నటుడు, అంతకంటే మంచి మనిషి శివ సుబ్రమణియన్ మరణవార్త విని చాలా షాక్ అయ్యాను. ఆయన భార్య దివ్యకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.ఈ విషాదాన్ని తట్టుకునేంత శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నా' అని పేర్కొన్నారు. 1989లో పరిండా సినిమాతో తెరంగేటరం చేసిన ఆయన.. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. స్టాన్లీ కా డబ్బా, తు హై మేరా సండే, ఉంగ్లీ, నెయిల్ పాలిష్ మరియు 2 స్టేట్స్‌లో ఆయన నటనతో విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్నారు. చివరిగా కరణ్ జోహార్ ప్రొడక్షన్‌లో వచ్చిన మీనాక్షి సుందరేశ్వర్ సినిమాలో ఆయన కనిపించారు.